చిన్నప్పుడు ఒకడు పార్కులో నన్ను అలా తీసుకెళ్ళాడంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన లేడీ కమెడియన్..!

సాధారణంగా బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలు ప్రసారం అవుతూ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతాయి. ఈ క్రమంలోనే బుల్లితెరపై జీ తెలుగులో యాంకర్ ప్రదీప్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ సూపర్ క్వీన్ అనే కార్యక్రమానికి నిర్వహిస్తున్నారు.తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎంతో మంది సీరియల్ ఆర్టిస్టులు, బిగ్ బాస్ కంటెస్టెంట్ లు లేడీ కమెడియన్స్ పాల్గొన్నారు.తాజాగా ఎన్నో సినిమాలలో లేడీ కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న స్నిగ్ధ గురించి అందరికీ పరిచయమే.

ఈమె అలా మొదలైంది, మేం వయసుకు వచ్చాం వంటి సినిమాల ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న చూడటానికి అచ్చం అబ్బాయి లాగా ఉంటుంది. ఈ కార్యక్రమంలో ఈమె మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. మొట్టమొదటిసారిగా తన తండ్రితో కలిసి ఈ కార్యక్రమానికి వచ్చిన స్నిగ్ధ తన చిన్నప్పుడు జరిగిన సంఘటనను గుర్తుచేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఈ క్రమంలోనే మనం చిన్నప్పుడు స్కూల్ కి వెళ్లేటప్పుడు మన తల్లిదండ్రులు ఎన్నో జాగ్రత్తలు చెబుతుంటారు అలా తనకు ఎన్నో జాగ్రత్తలు చెప్పారని అయినా కానీ ఇందిరా పార్క్ లో నేను ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు ఒకడు పక్కకు వెళ్ళిపోయాడని ఈ సందర్భంగా తన చిన్నప్పుడు జరిగిన సంఘటనను గుర్తుచేసుకుని స్నిగ్ధ ఎమోషనల్ అయ్యారు. అలాగే కార్తీకదీపం సీరియల్ మోనిత తన తల్లికి జరిగిన అవమానాలు గురించి తెలియజేస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వైరల్ గా మారింది.