పెద్ద రన్ టైం తో “ఖుషి”..వర్కౌట్ అయ్యేనా?

ఇప్పుడు టాలీవుడ్ నుంచి రాబోతున్న పలు ఇంట్రెస్టింగ్ చిత్రాల్లో అయితే కాస్త నోటెడ్ చిత్రం రిలీజ్ గా అయితే యంగ్ అండ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్ గా దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన చిత్రం “ఖుషి” కూడా ఒకటి.

మరి ఈ చిత్రాన్ని అయితే మేకర్స్ ఓ ఫామిలీ డ్రామాగా తెరకెక్కించి తీసుకొస్తుండగా రీసెంట్ గా ట్రైలర్ తో అయితే అంత నమ్మకాన్ని ఈ చిత్రాన్ని తీసుకు రాలేకపోయింది. అయితే ఈ చిత్రం ఇప్పుడు సెన్సార్ కార్యక్రమాలు కంప్లీట్ చేసుకున్నట్టుగా సినీ వర్గాలు కన్ఫర్మ్ చేసాయి.

కాగా ఈ చిత్రం భారీ రన్ టైం తోనే రాబోతున్నట్టుగా దీనితో తెలుస్తుంది. కాగా ఈ చిత్రం మొత్తం 165 నిమిషాల నిడివిని అయితే క్లాక్ చేసుకుంది. అంటే సుమారు ఈ చిత్రం 2 గంటల 45 నిముషాలు వచ్చింది. ఇక ఇంటర్వెల్ అవన్నీ కలిపి ఈ చిత్రం సుమారు మూడు గంటలు వేసుకోవచ్చు.

దీనితో ఈ చిత్రం కంటెంట్ కి ఇది పరీక్షే అని చెప్పాలి. ఇప్పటికే ట్రైలర్ పెద్దగా ఏమీ అనిపించలేదు. మళ్ళీ ఇంత పెద్ద నిడివి అంటే ఇక ఆలోచించాల్సిన విషయమే అని చెప్పాలి. మరి థియేటర్స్ లో ఈ చిత్రం ఎలా రాణిస్తుందో చూడాలి. కాగా ఈ చిత్రాన్ని హీశం అబ్దుల్ వహద్ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించారు అలాగే ఈ సెప్టెంబర్ 1న పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.