ఉప్పెన సినిమాలో బేబమ్మ పాత్రలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కృతి శెట్టి మొదటి సినిమా మంచి విజయం కావడంతో అనంతరం ఈమెకు వరుస సినిమా అవకాశాలు వచ్చాయి. ఇలా ఈమె ఉప్పెన తర్వాత నటించిన శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు వంటి సినిమాలు హిట్ అవ్వడంతో వరుస అవకాశాలు వచ్చాయి. అయితే వచ్చిన అవకాశాలన్నింటినీ ఈమె సద్వినియోగం చేసుకున్నారు. ఈ క్రమంలోనే తర్వాత నటించిన మాచర్ల నియోజకవర్గం, దివారియర్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి.
ఇలా ఈ సినిమాలు ఫ్లాప్ అవడంతో ఈమెకు అవకాశాలు కూడా రావడం కష్టతరంగా మారాయి.ఇలా అవకాశాలు తగ్గిపోతున్న క్రమంలో కృతి శెట్టి అవకాశాల కోసం తాను పెట్టుకున్నటువంటి లిమిట్స్ కూడా క్రాస్ చేశారని తెలుస్తోంది.ఈమె తన తల్లికి ఇష్టం లేకపోయినా బోల్డ్ ఫోటోషూట్ లో నిర్వహిస్తూ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ విషయంలో తన తల్లి వారించినప్పటికీ డోంట్ కేర్ అంటూ ఫోటోషూట్లకు సిద్ధమయ్యారట.
ఇలా ఫోటోషూట్లు చేసి అవకాశాలు తెచ్చుకోవడం కాదు మన టాలెంట్ నిరూపించుకొని అవకాశాలు తెచ్చుకో అని తన తల్లి చెప్పినప్పటికీ తల్లి మాట మాత్రం బేబమ్మ పెడచెవిన పెట్టినట్లు తెలుస్తోంది.మరి ఫోటోషూట్స్ ద్వారా అయినా ఈమెకు అవకాశాలు వస్తాయా లేదా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే ఈమె నాగచైతన్య హీరోగా నటిస్తున్న కష్టడి సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా సక్సెస్ అయితేనే ఈమెకు ఇండస్ట్రీలో మనుగడ ఉంటుందని లేకపోతే తన కెరియర్ ఇంతటితోనే ముగుస్తుందని మరికొందరు భావిస్తున్నారు.