కృతి శెట్టికి ఆ మెగా ఛాన్స్ నిజమేనా.?

మెగా కాంపౌండ్ హీరోగా ‘ఉప్పెన’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు వైష్ణవ్ తేజ్. తొలి సినిమాతోనే సంచలనాలు సృష్టించేశాడీ కుర్ర హీరో.

ఆ తర్వాత ‘కొండపొలం’ అనే ఓ సింపుల్ మూవీలో నటించి నటన పరంగా తన టాలెంట్ చూపించుకున్నాడు. ఆ తర్వాత నుంచీ గ్రాడ్యుయల్‌గా తనలోని టాలెంట్‌కి పదును పెడుతూ విభిన్న తరహా సినిమాలు చేస్తూ వస్తున్నాడు.

యూత్ ఫుల్ మూవీగా పేరు తెచ్చుకుంది వైష్ణవ్ తేజ్ నటించిన ‘రంగ రంగ వైభవంగా’. అయితే, బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలు నమోదు చేయలేదీ సినిమా.

ఇక, ఇప్పుడు ‘ఆది కేశవ్’ సినిమాతో రాబోతున్నాడు. నవంబర్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శ్రీలీల ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.

కాగా, తొలి సినిమా పాట్నర్ అయిన కృతి శెట్టితో వైష్ణవ్ తేజ్ ప్రేమ వ్యవహారం సాగిస్తున్నాడన్న ఓ గాసిప్ ఈ మధ్య చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే.

అతి కొద్ది టైమ్‌లోనే ఈ న్యూస్ తెగ పాకేసింది మీడియా హ్యాండిల్స్‌లో. ఎక్కువ మంది ఈ జంట గురించి మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. ఈ క్రేజ్‌ని క్యాష్ చేసుకోవాలన్న వుద్దేశ్యంతో ఓ యంగ్ డైరెక్టర్ ఈ కాంబోపై ఓ స్టోరీ లైన్ ప్రిపేర్ చేశాడట.

ఆ స్టోరీ లైన్ వైష్ణవ్ తేజ్‌కి బాగా నచ్చిందట. త్వరలోనే పట్టాలెక్కించేద్దాం.. అని మాటిచ్చాడట. అయితే, కృతి శెట్టికి ప్రస్తుతం అంత సీనుందా.? ఐరెన్ లెగ్ ముద్ర వేయించుకుని టాప్ హీరోయిన్ రేస్ నుంచి పక్కకెళ్లిపోయింది ఇప్పుడు కృతి శెట్టి. సో.. ఈ కాంబో వర్కవుట్ అవ్వడం అంటే కాస్త ఆలోచించాల్సిందే.!