ఉప్పెన సినిమాలో “నీ కన్ను నీలి సముద్రం ” విడుదల అయిన నాటి నుండి హీరోయిన్ కృతి శెట్టి మీద కుర్ర హృదయాలలో ప్రేమ ఉప్పెన లా పొంగుతూనే ఉంది.సినిమా రిలీజ్ కాలేదు ఇంకా, కానీ ఒకటి రెండు సాంగ్స్ తోనే ఆ సినిమా హీరోయిన్ కృతి శెట్టి సూపర్ పాపులర్ అయిపోయింది.
వాస్తవానికి ఈ అమ్మాయి స్క్రీన్ పేరు అద్వయిత. ఆ పేరుతో కన్నడ, తమిళ సినిమాలు చాలా చేసింది. తెలుగులోకి వస్తూ, మళ్లీ తన ఒరిజినల్ పేరు కృతి శెట్టి పేరుతోనే పరిచయం అవుతోంది.
ఇప్పుడు ఈ హీరోయిన్ మీద టాలీవుడ్ నిర్మాతల కన్ను పడింది. ఎవరి సినిమాలకు వారు ఈ అమ్మాయి కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. కానీ బాగా ప్రామిసింగ్ ప్రాజెక్టులు మాత్రమే ఓకె చేసే ఆలోచనతో చాలా తాపీగా సినిమాలు ఓకె చేస్తోంది. అలా ఒకే చేసిన సినిమా ‘శ్యామ్ సింగ రాయ్’ ఈ సినిమాలో నాని సరసన నటించబోతోంది.
ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు వుంటారు. ఒకరు తొలిసగం, మరొకరు మలిసగం, ఇంకొకరు చివర్లో చిన్న పాత్రలో. మలిసగం పాత్రకు ఇప్పటికే సాయి పల్లవిని తీసుకున్నారు. తొలిసగం పాత్రకు కృతి శెట్టిని తీసుకుంటున్నారు.
ఇదిలా వుంటే శ్యామ్ సింగ రాయ్ సినిమాను నిర్మిస్తున్న సితార ఎంటర్ టైన్ మెంట్స్ మరో సినిమాకు కూడా ఈ హీరోయిన్ ను బ్లాక్ చేస్తున్నట్లు సమాచారం. ఆ బ్యానర్ లో చాలా మిడ్ రేంజ్ సినిమాలు ప్లానింగ్ లో వున్నాయి. దేనికో దానికి అవసరం పడుతుందని, ముందుగానే రెండు సినిమాలకు ఒప్పించినట్లు తెలుస్తోంది.