దివంగత హీరో సూపర్ స్టార్ కృష్ణ ఇటీవలే అనారోగ్యం కారణంగా తుది శ్వాస విడిచిన విషయం మనందరికీ తెలిసిందే. నవంబర్ 15న సూపర్ స్టార్ కృష్ణ మరణించారు. సూపర్ స్టార్ కృష్ణ మరణంతో ఒక్కసారిగా ఘట్టమనేని ఫ్యామిలీలో అలాగే తెలుగు సినీ ఇండస్ట్రీలో విషాదచాయలు అలుముకున్నాయి. ఇప్పటికీ అభిమానులు, కుటుంబ సభ్యులు కృష్ణ మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. కాగా కృష్ణ హీరోగా దాదాపుగా 350కు పైగా సినిమాలలో నటించి మెప్పించిన విషయం తెలిసిందే. కృష్ణ మరణంతో మహేష్ బాబు కూడా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనయ్యాడు.
అంతేకాకుండా మహేష్ బాబు ఒకే ఏడాదిలో అమ్మ నాన్న అన్నలను ఒకరి తర్వాత ఒకరిని కోల్పోయారు. ఒకరి మరణ వార్త నుంచి చేరుకునే లోపే మరొకరు మరణించడం అన్నది నిజంగా బాధాకరం అని చెప్పవచ్చు. అయితే మహేష్ బాబు ఆ బాధ నుంచి తేరుకోలేకపోతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా సూపర్ స్టార్ కృష్ణ మరణం పట్ల సోదరుడు ఆది శేషగిరిరావు మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. అన్నయ్య కృష్ణ చనిపోయిన తర్వాత అంతా శూన్యం అయిపోయింది అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. నాకు అన్నయ్యతో 70 ఏళ్ల అనుబంధం ఉంది. ఆయన లేకపోవడంతో ఒక్కసారిగా శూన్యం అయిపోయింది.. అయినా స్మారక మందిరాన్ని నిర్మించాలనే ఆలోచన ఉంది అని అన్నారు.
మా అన్నయ్య నా చిన్నప్పుడు సైకిల్ పై సినిమాలకు తీసుకెళ్లడం ఇప్పటికే నాకు గుర్తుకు ఉంది అంటూ ఎమోషనల్ అయ్యారు ఆది శేషగిరిరావు. కృష్ణ అన్నయ్యకి సినిమాల లెక్కలకు సంబంధించిన విషయాలలో అన్నయ్యకి మంచి అవగాహన ఉండేది. అప్పట్లో అన్నయ్య అల్లూరి సీతారామరాజు సినిమా రిలీజ్ అయ్యే వరకు రోజుకు మూడు షిఫ్టులు పనిచేస్తూ వచ్చారు. అల్లూరి సీతారామరాజు సినిమాను ఓకే కెమెరాతో ఒకే లెన్స్ తో చిత్రీకరించారు అంటూ కృష్ణ గొప్పతనం గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు ఆది శేషగిరి రావు.