అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగ చైతన్య .. అఖిల్ హీరోలుగా వచ్చి వరసగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అక్కినేని నాగార్జున వారసులుగా ఇండస్ట్రీకి పరిచయం అయినప్పటికి తమ టాలెంట్ తో స్టార్స్ గా నిలబడటానికి సొంతగా కృషి చేస్తున్నారు. ఇప్పటికే నాగ చైతన్య లవర్ బాయ్ ఇమేజ్ తో మంచి సినిమాలు చేస్తే స్టార్ గా ఎదిగాడు. టాలీవుడ్ లో తనకంటూ ఒక ఇమేజ్ ని ప్రత్యేకమైన మార్కెట్ ని సంపాదించుకున్నాడు. అఖిల్ ఇంకా స్టార్ గా క్రేజ్ తెచ్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రస్తుతం 4 న సినిమాగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమా చేస్తున్నాడు.
అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో డెబ్యూ హీరోగా సాధించిన రికార్డ్ గురించే ఆసక్తికరమైన చర్చలు మొదలయ్యాయి. అందుకు కారణం మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాతో టాలీవుడ్ కి హీరోగా పరిచయం అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా విపరీతమైన బజ్ క్రియేట్ అయింది. మరికొన్ని గంటల్లో థియేటర్స్ లోకి వస్తోంది ఉప్పెన. అయితే మెగా మేనల్లుడు ముందు పెద్ద టార్గెటే ఉందని చెప్పుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ నటించిన చిరుత రికార్డ్ బ్రేకింగ్ తొలి వీకెండ్ కలెక్షన్లతో సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఈ రికార్డును అక్కినేని వారసుడు అఖిల్ బ్రేక్ చేశాడు. అఖిల్ నటించిన డెబ్యూ మూవీ అఖిల్ 7.5 కోట్లు వసూలు చేసింది. ఇంకా ఈ రికార్డ్ ఇలాగే ఉంది.
అఖిల్ తర్వాత టాలీవుడ్ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ వారసుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన ఫస్ట్ మూవీ ‘అల్లుడు శ్రీను’ మూడో స్థానంలో నిలిచింది. రికార్డుల పరంగా చరణ్-అఖిల్- శ్రీను ఉత్తమ తొలి చిత్ర హీరోలుగా ఓపెనింగు రికార్డులు సాధించారు. ఇప్పుడు ఈ రికార్డ్ ని వైష్ణవ్ తేజ్ బ్రేక్ చేస్తాడని ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు. ఉప్పెన సినిమా తో రాబోతున్న వైష్ణవ్ తేజ్ మీదే అందరి దృష్టి ఉంది. ఇప్పటికే ఈ సినిమా సాంగ్స్ పరంగా.. పోస్టర్స్ పరంగా విపరీతమైన క్రేజ్ ని ఏర్పరచింది. గత ఏడాదిగా ఉప్పెన సినిమా గురించి వార్తలు వస్తున్నా ఒక్కసారిగా ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత అంచనాలు ఆకాశాన్ని తాకాయి. చూడాలి మరి ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో.