అరవ ఎఫెక్ట్ : ఇంకా అసంతృప్తిగానే మెగాస్టార్ ఫ్యాన్స్?

ఇప్పుడు సౌత్ ఇండియా సినిమా మరోసారి షైన్ అవుతుంది. ఇప్పటికే పలు భారీ హిట్ చిత్రాలతో టాలీవుడ్ కోలీవుడ్ కూడా ట్రాక్ లోకి రాగా మళ్ళీ తమిళ ఇండస్ట్రీ మాత్రం భారీ హిట్ సినిమాలు అలాగే భారీ అనౌన్సమెంట్ లతో రానున్న రోజుల్లో సెన్సేషనల్ హైప్ ను అయితే అందుకుంటుంది.

ఇక ఇదిలా ఉండగా తమిళ సినిమాలో అనౌన్స్ అవుతున్న ప్రాజెక్ట్ లు చూసి అయితే టాలీవుడ్ ఆడియెన్స్ మెయిన్ గా మెగాస్టార్ ఫ్యాన్స్ బాగా డిజప్పాయింట్ అవుతున్నారు. అక్కడ హీరోలు తమ ఫ్యాన్ దర్శకులతో క్రేజీ చిత్రాలు జైలర్, విక్రమ్ ఇపుడు తలైవర్ 171, లియో లాంటివి చేస్తుంటే.

ఇక్కడ మెగాస్టార్ ఏమో తనకి హార్డ్ కోర్ ఫ్యాన్స్ అయ్యిన సందీప్ రెడ్డి వంగ లాంటి వారితో చేయకుండా ఏవేవో సినిమాలు చేస్తున్నారు అని అంటున్నారు. అయితే ఇప్పుడు చిరు నుంచి రెండు డైరెక్ట్ స్ట్రైట్ ప్రాజెక్ట్ లు ఉన్నప్పటికీ అరవ ఇండస్ట్రీ నుంచి వచ్చిన అనౌన్సమెంట్స్ మాత్రం మెగా ఫ్యాన్స్ కి నిద్ర పట్టనివ్వడం లేదు.

మళ్ళీ చిరు ఎప్పుడు ఇలాంటి ప్రాజెక్ట్ లు అనౌన్స్ చేస్తారని చాలా అసంతృప్తి గానే ఉన్నారు. మరి మెగాస్టార్ ఇప్పుడు తమిళ్ నుంచి రజిని, కమల్ హాసన్ లాంటి తన ఏజ్ సీనియర్ స్టార్స్ చేస్తున్న తరహా బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ లని ఎప్పుడు టేకప్ చేస్తారో వేచి చూడాలి మరి. ఇప్పుడు అయితే అందరి అంచనాలు బింబిసార దర్శకుడితో చేసే మెగా 157 పైనే ఉన్నాయి. ఇదే మ్యాజిక్ చేస్తుంది అని అంతో ఇంతో అసలు పెట్టుకున్నారు.