ఓ కొత్త వెబ్‌ సిరీస్‌ తో ప్రేక్షకుల ముందుకు..

వైవిధ్యభరితమైన సినిమాలు చేస్తూ.. తనకంటూ సౌత్‌ ఇండస్ట్రీలో మంచి ఫాలోయింగ్‌ సంపాదించుకున్నాడు కోలీవుడ్‌ స్టార్‌ హీరో ఆర్య . ఇక ఆర్య నటించిన తమిళ సినిమాలు తెలుగులో కూడా డబ్‌ అయ్యి మంచి విజయం సాధించాయి. అయితే ఆర్య ఓ కొత్త వెబ్‌ సిరీస్‌ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ఆర్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా వెబ్‌సిరీస్‌ ‘ది విలేజ్‌’. మిలింద్‌ రాజు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’లో ఈ వెబ్‌ సిరీస్‌ విడుదల అయింది. . ఇప్పటికే ఈ సిరీస్‌ నుంచి వచ్చిన ఫస్ట్‌ లుక్‌తో పాటు టీజర్‌లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సిరిస్‌ నుంచి మేకర్స్‌ ట్రైలర్‌ విడుదల చేసిన ట్రైలర్ ఆకట్టుకుంది. ఆర్య తన ఫ్యామిలీతో కలిసి రోడ్‌ ట్రిప్‌ కి వెళుతుండగా వారి వాహనం పాడవ్వడంతో ట్రైలర్‌ మొదలవుతుంది. ఇక ట్రైలర్‌ గమనిస్తే.. తన ఫ్యామిలీతో కలిసి ఆర్య ఒక భయంకరమైన గ్రామంలో చిక్కుకుంటాడు.

అయితే అక్కడున్న వింత మనుషుల నుంచి తన ఫ్యామిలీని రక్షించుకునేందుకు ఆర్య ఎలాంటి సాహసాలు చేస్తాడు అనేది సిరీస్‌ స్టోరీ. ఇక తొలిసారి గ్రాఫిక్‌ నవల ఆధారంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సిరీస్‌ తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో నవంబరు 24న స్ట్రీమింగ్‌ అవుతోంది.