Klin Kaara: మొదటిసారి తండ్రిని టీవీలో చూసి మురిసిపోతున్న క్లిన్ కారా.. వీడియో వైరల్!

Klin Kaara: మెగా ప్రిన్సెస్ క్లిన్ కారా మొదటిసారి తన తండ్రి రామ్ చరణ్ ను టీవీలో చూస్తూ చాలా ఎక్సైట్ అయిపోయారు. ఇలా తన తండ్రి రామ్ చరణ్ టీవీలో కనిపించే సరికి క్లిన్ కారా సంతోషంతో కేకలు వేస్తూ సందడి చేశారు ఇందుకు సంబంధించిన వీడియోని ఉపాసన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ… తన తండ్రిని మొదటిసారి స్క్రీన్ పై చూస్తోంది అంటూ క్యాప్షన్ పెట్టారు.

ప్రస్తుతం ఉపాసన షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అయితే ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ ఎన్టీఆర్ నటించిన ఆస్కార్ విన్నింగ్ చిత్రం ఆర్ఆర్ఆర్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మేకింగ్‌కి సంబంధించి రీసెంట్‌గా డాక్యుమెంటరీ రూపంలో తీసుకువచ్చిన విషయం తెలిసిందే.ఆర్ఆర్ఆర్: బిహైండ్ & బియాండ్ అంటూ ఈ డాక్యుమెంటరీ రాగా.. ప్రస్తుతం ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఈ డాక్యుమెంటరీని చూస్తున్న క్లిన్ కారను అక్కడే ఉన్నటువంటి ఉపాసన అక్కడ ఉన్నది ఎవరు అంటూ రామ్ చరణ్ ని చూపించి అడుగుతుంటారు.

ఇలా తొలిసారి తన తండ్రిని స్క్రీన్ పై చూసి చాలా ఎక్సైట్ గా ఫీల్ అవుతుందని తెలియజేశారు అదే విధంగా రామ్ చరణ్ నీ గురించి చాలా గర్వంగా ఉంది. గేమ్ చేంజర్ కోసం క్లీంకారతో పాటు మేము ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం అంటూ ఉపాసన ఈ సందర్భంగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. RRR తరువాత రామ్ చరణ్ నటించిన చిత్రం గేమ్ చేంజర్ కావటం విశేషం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఈ చిత్రం జనవరి 10వ తేదీ విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి మరి అంచనాలకు అనుగుణంగా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోగలద లేదా అనేది తెలియాల్సి ఉంది.