స్టార్ హీరోయిన్‌కి గాలమేస్తోన్న కిరణ్ అబ్బవరం.!

కిరణ్ అబ్బవరం.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. హిట్టూ ఫట్టూ అనే తేడా లేకుండా వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ పోతున్నాడీ యంగ్ హీరో. త్వరలో ‘మీటర్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు కిరణ్ అబ్బవరం. ఈ సినిమాతో ‘మాస్’ పాట్లు పడుతున్నాడు. కానీ, అంత సీన్ లేదని అంటున్నారు.

‘మా సినిమా హిట్టే’ అని మాటల్లో అనిపించుకోవడం తప్ప, నిఖార్సయిన హిట్టుగా ట్రేడ్ పండితులు తేల్చలేని పరిస్థితి కిరణ్ అబ్బవరం సినిమాకి. ఇదిలా వుంటే, కిరణ్ అబ్బవరం తాజాగా ఓ స్టార్ హీరోయిన్‌తో కలిసి పని చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాడట. హీరోయిన్ ఓరియెంటెడ్ కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమా కోసం ఆ స్టార్ హీరోయిన్‌తో మంతనాలు చేసేందుకు కిందా మీదా పడుతున్నాడట.

ఓ పెద్ద బ్యానర్ సాయంతో ఆ హీరోయిన్‌కి గాలమేస్తున్నాడట. సదరు హీరోయిన్ వైపు నుంచీ కొంత సానుకూల స్పందనలే వున్నట్లు తెలుస్తోంది. ఎవరా హీరోయిన్.? ఏంటా కథ.? తెలియాలంటే లెట్స్ వెయిట్ అండ్ సీ.!