‘వినరో భాగ్యము విష్ణు కథ’ సినిమా హిట్టా.? ఫ్లాపా.? ఆయన గత చిత్రాల్లానే ఈ సినిమాని కూడా ‘హిట్టే’ అనిపించడానికి చాలా చాలా కష్టపడ్డారు. ‘హిట్టే’ అని చెప్పేసుకుంటున్నారుగానీ, తెరవెనుకాల వ్యవహారం వేరేలా వుంది.
అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, హీరో కిరణ్ అబ్బవరం ఒకింత గుస్సా అవుతున్నాడట తన కెరీర్ గురించి. ఒక్క సినిమా తేడా కొడితేనే ఇలా అయిపోయాడా.? అంటే, బ్యాక్ టు బ్యాక్.. చేస్తున్న సినిమాలేవీ వర్కవుట్ కావడంలేదు మరి.
దర్శకత్వంలో వేలు పెట్టడం వల్లే ఈ సమస్య అన్నది ఇన్‌సైడ్ సోర్సెస్ కథనం. అబ్బే, కిరణ్ అబ్బవరం మంచి బాలుడు.. అన్న ఇంకో వాయిస్ కూడా బలంగానే వినిపిస్తోంది. అలాంటప్పుడు, ‘వేలు పెట్టి కెలుకుడు’ అనే ఆరోపణలెందుకు వస్తున్నట్టు.?
ఏమోగానీ, కిరణ్ అబ్బవరం అయితే ‘వినరో భాగ్యము విష్ణు కథ’ సినిమా విషయంలో హ్యాపీగా లేడు. తనను ఎవరో టార్గెట్ చేశారని వాపోతున్నాడు. ఇదే అభద్రతాభావం అంటే.! ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా, మంచి ఇమేజ్ క్రియేట్ అయ్యింది. అది తేడా కొట్టిందంటే.. లోపం అతనిలోనే వున్నట్టు కదా.?