బాలీవుడ్ హీరోయిన్స్ అందరినీ డామినేట్ చేస్తున్న కియారా అద్వానీ..!

కియార అద్వానీ ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. అర డజను సినిమాలు కూడా చేయలేదు కానీ అమ్మడి క్రేజ్ అంతా ఇంతా కాదు. బాలీవుడ్ లో హాట్ అందాల వడ్డింపు.. బోల్డ్ కారెక్టర్ లో నటించే తెగింపు చూసి దర్శక నిర్మాతలు…. సినిమా ఆఫర్స్ తో కియారా వద్ద క్యూ కడుతున్నారు. తెలుగు లో వినయ విదేయ రామ, భారత్ అనే నేను చిత్రాల్లో నటించిన కియారా ఆ తర్వాత ఏమైందో కానీ బాలీవుడ్ బాట పట్టింది. అక్కడ లేటెస్టు గా రిలీజ్ అయిన లక్ష్మి చిత్రం తో మంచి హిట్ కొట్టింది. దీంతో ప్రస్తుతం కీయార అద్వానీ బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ జాబితాలో చేరిపోయింది.

Laxmmi Bomb Trailer Out! Akshay Kumar, Kiara Advani's horror-comedy to  leave you intrigued this Diwali | Bollywood News – India TV

నటిగా తన టాలెంట్ ను చూపిస్తూ…అందాల ప్రదర్శనలో వెనక్కి తగ్గని కీయారా… ప్రస్తుతం బాలవుడ్ లో క్రేజీ ప్రోజెక్ట్ లలో నటిస్తోంది. ఈ ఏడాది నాలుగు పెద్ద సినిమాల్లో నటిస్తూ కియరా…బిజీ హీరయిన్ గా మారిపోయింది. తాజాగా ఈ అమ్మడు బాలీవుడ్ లో మోస్ట్ వెయి టెడ్ మూవీ లో నటించేందుకు చాన్స్ కొట్టేసింది. క్రిష్ 4 వంటి భారీ బడ్జెట్ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిందని సమాచారం. హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న భారీ యాక్షన్ మూవీ క్రిష్ 4. ఈ మూవీ లో చోటు దక్కడం అంటే మామూలు విషయం కాదు.

Krrish 4: Kiara Advani To Be Paired Opposite Hrithik Roshan In The  Superhero Film?

హృతిక్ తో జోడీ కట్టేందుకు స్టార్ హీరోయిన్స్ పోటీపడుతున్నారు. మొదట ఈ చిత్రం లో హీరోయి న్ గా కృతి సనన్ పేరు వినిపించింది. ఐతే కృతి ఇతర ప్రోజెక్ట్ ల తో బిజీగా గా ఉండటం తో…ఆ అవకాశం కియారా కు దక్కిందని వార్తలు వస్తున్నాయి. దింతో అమ్మడు జాక్ పాట్ కొట్టిందంటు అభిమానులు సంబరపడుతున్నారు. బాలీవుడ్ స్టార్ హీరయిన్ లను డామినేట్ చేస్తుందన్న టాక్ కూడా వినిపిస్తోంది. కాగా క్రిష్ 4 వచ్చే ఏడాది పట్టలెక్కనుంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ అందుకు తగ్గట్లుగా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమయ్యారు.