కలెక్షన్లలో ‘ఖుషి’ దూకుడు!

విజయ్‌ దేవరకొండ సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఖుషి సినిమా మొదటినుంచి కూడా పాజిటివ్‌ వైబ్రేషన్స్‌ క్రియేట్‌ చేస్తూ బాక్సాఫీస్‌ వద్ద అంచనాలను అయితే పెంచేసింది. మ్యూజిక్‌ తో పాటు టీజర్‌ ట్రైలర్‌ అలాగే మరికొన్ని పోస్టర్లు కూడా జనాలను థియేటర్లకు వచ్చేలా చేశాయి.

మొత్తానికి మొదటి రోజు అయితే చాలా ఏరియాలలో ఈ సినిమా హౌస్‌ ఫుల్‌ కలెక్షన్స్‌ తో దర్శనమించింది. ఇక విజయ్‌ దేవరకొండ మొదటి రోజు ఖుషి సినిమాతో ఏపీ తెలంగాణలో కెరీర్‌ బెస్ట్‌ కలెక్షన్స్‌ అందుకు న్నాడని చెప్పవచ్చు. లైగర్‌తో పోలిస్తే ఇప్పుడు ఖుషి సినిమా ఏపీ తెలంగాణలో అంతకంటే ఎక్కువ స్థాయిలో షేర్‌ కలక్షన్స్‌ అందుకుంది.

మిగతా భాషల్లో ఎలా ఉన్నా తెలుగులో మాత్రం రౌడి స్టార్‌ ప్రతి సినిమాతో తన మార్కెట్ను పెంచుకునే విధంగా అడుగులు వేస్తూ ఉన్నాడు. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 52 కోట్ల రేంజ్‌ లో అయితే ఫ్రీ రిలీజ్‌ బిజినెస్‌ చేసింది. ఖుషి సినిమా బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌ 53 కోట్లు. అంటే సినిమా లేటెస్ట్‌ కలెక్షన్స్‌ బట్టి ఇంకా 38 కోట్లకు పైగానే షేర్‌ కలెక్షన్స్‌ రావాల్సి ఉంది.