త్వరలోనే త్రివిక్రమ్‌తో మరో సినిమా.. సెన్సేషనల్ అప్డేట్ ఇచ్చిన మహేష్ బాబు

Khaleja Turns 10 Mahesh babu Announces Movie With Trivikram

టాలీవుడ్‌లో కొన్ని కాంబినేషన్‌లు ఉంటాయి. వారి కాంబోలో సినిమాలు వస్తే చాలు అభిమానులకు పండగే. అవి హిట్టా ఫట్టా అన్నది తర్వాతి లెక్క. సినిమా వచ్చిందా లేదా అన్నదే ముఖ్యం. అలాంటి వాటిలో ముఖ్యంగా దర్శకుడి పేరులో త్రివిక్రమ్ ఉంటాడు. ఇక పక్కన తమ తమ అభిమాన హీరోలు ఉండాలని ప్రతీ ఫ్యాన్ కోరుకుంటాడు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నిత్యం అదే అడుగుతుంటారు. మళ్లీ పవన్-త్రివిక్రమ్ కాంబో కావాలి అంటూ డిమాండ్ చేస్తారు.

Khaleja Turns 10 Mahesh babu Announces Movie With Trivikram
Khaleja Turns 10 Mahesh babu Announces Movie With Trivikram

మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే ఎప్పటి నుంచి ఈ డిమాండ్‌ను లేవనెత్తుతూనే ఉన్నారు. అసలే వీరి కాంబోలో ఇది వరకే అతడు, ఖలేజా వంటి చిత్రాలు వచ్చాయి. ఇవి రెండూ బుల్లితెరపై ఎప్పటికీ నిలిచిపోయే ఎవర్ గ్రీన్ చిత్రాలు. అతడు సినిమాను ఇప్పటికే కొన్ని వందల సార్లు చూసి ఉంటారు తెలుగు ప్రేక్షకులు. ఇంకా కొన్ని వేల సార్లు చూసేందుకైనా రెడీగానే ఉంటారు. ఎందుకంటే అది త్రివిక్రమ్ మహేష్ బాబు చేసిన మ్యాజిక్.

ఇక ఖలేజా కూడా అలాంటి కోవకే చెందింది. వెండితెరపై ఆకట్టుకోలేకపోయింది. కానీ బుల్లితెరపై మాత్రం సూపర్ హిట్, మహేష్‌లోని మరో కోణాన్ని ఆవిష్కరించింది ఈ చిత్రం. ఈ మూవీ వచ్చి నేటికి పదేళ్లు అవుతోంది. ఈ క్రమంలో మహేష్ బాబు నాటి సంగతులను గుర్తు చేసుకున్నాడు. ఈ క్రమంలో మహేష్ బాబు ట్వీట్ చేస్తూ.. ఖలేజాకు పదేళ్లు.. నటుడిగా నన్ను కొత్తగా ఆవిష్కరించింది. ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచే చిత్రం. దీనంతటికి కారణం బ్రిలియంట్ అయిన నా స్నేహితుడు త్రివిక్రమ్. మరో చిత్రం చేసేందుకు ఎంతో ఎదురుచూస్తున్నాను. అది అతి త్వరలోనే రాబోతోంది అంటూ అదిరిపోయే న్యూస్ ఇచ్చాడు. దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్ పండుగ చేసేసుకుంటున్నారు.