అమ్మో అంత పెద్ద కే‌జి‌ఎఫ్ హీరో యాష్ ని భయపెడుతోంది ఈ పిల్ల దయ్యం !

KGF hero Yash playing with his daughter

కేజీఎఫ్ సినిమా రాకముందు యష్ అంటే ఎవ్వరికీ తెలియదు. కన్నడ హీరో అయినా కూడా ఆయన గురించి పెద్దగా తెలియదు. కానీ.. ఎప్పుడైతే యష్ నటించిన కేజీఎఫ్ సినిమా రిలీజ్ అయిందో ఒక్కసారిగా యష్ నేషనల్ స్టార్ అయిపోయాడు. దేశమంతా ఆ సినిమా గురించే చర్చించింది. ఆ సినిమా సూపర్ సక్సెస్ కావడంతో కేజీఎఫ్ చాప్టర్ 2 ను తెరకెక్కిస్తున్నారు. ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకుడు. యష్ ప్రస్తుతం కేజీఎఫ్ 2 సినిమా షూటింగ్ బిజీలో ఉన్నాడు.

KGF hero Yash playing with his daughter
KGF hero Yash playing with his daughter

ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. తన ఇద్దరు పిల్లలతో ఎక్కువ సమయం గడపడానికే యష్ ఇష్టపడుతుంటాడు. యష్ సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గానే ఉంటాడు. అలాగే ఆయన భార్య కూడా తమ పిల్లల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. అయితే.. తాజాగా యష్ తో తన కూతురు ఉన్న ఒక ఫోటోను షేర్ చేశారు. ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

యష్ తన కూతురు ఐరాకు ఇటీవలే పుట్టు వెంట్రుకలు తీయించాడట. అయితే.. వాళ్లు షేర్ చేసిన ఫోటోలో యష్ కూతురు గుండుతో కనిపిస్తుంది. యష్ చూస్తేనేమో ఫుల్లు జుట్టుతో ఉంటాడు. దీంతో తన కూతురు కోపంతో యష్ వైపు చూస్తుంది. నాకేమో గుండు కొట్టించి.. నువ్వు మాత్రం బారెడు జుట్టుతో ఉన్నావా? అన్నట్టుగా ఐరా చూస్తోందన్నట్టుగా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి కేజీఎఫ్ హీరోనే ఐరా బయపెట్టేస్తోందిగా.. అంటూ నెటిజన్లు సరదా కామెంట్ల చేస్తున్నారు.