HomeEntertainment'జులై 16 ' న సెలవు కావాలట .. మోడీని కోరుతున్న 'కేజీఎఫ్-2' ఫ్యాన్స్!

‘జులై 16 ‘ న సెలవు కావాలట .. మోడీని కోరుతున్న ‘కేజీఎఫ్-2’ ఫ్యాన్స్!

కేజీఎఫ్‌ 2 జూలై 16న ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌ కాబోతుంది. దీంతో త్వరలోనే రాకీ భాయ్‌ వచ్చేస్తున్నాడోచ్‌ అంటూ అభిమానులు సంబరాలు మొదలు పెట్టారు. కన్నడ స్టార్‌ యశ్‌ హీరోగా, ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా చిత్రమే కేజీఎఫ్‌ చాప్టర్‌ 2. 2018లో బాక్సాఫీస్‌ దద్దరిలిపోయేలా చేయడంతో పాటు దక్షిణాది సినీ పరిశ్రమను మరో మెట్టు ఎక్కించిన కేజీఎఫ్‌కు సీక్వెల్‌గా వస్తోందీ.

Yash On Kgf Chapter 2 Teaser Leaked

ఈ సినిమాలో రాకీ భాయ్‌ను ఢీ కొట్టేందుకు అధీరాగా వస్తున్నాడు బాలీవుడ్‌ హీరో సంజయ్‌దత్‌. రవీనా టాండన్‌ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ పాన్ ఇండియా చిత్రాన్ని హోంబలే ఫిలింస్‌ పతాకంపై విజయ్‌ కిరగందూర్ నిర్మిస్తున్నారు. కన్నడ, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కేజీఎఫ్‌ 2 విడుదల కానుంది. కన్నడ స్టార్ యశ్ హీరోగా వస్తున్న ‘కేజీఎఫ్-2’ చిత్రం విడుదల రోజున జాతీయ సెలవు దినాన్ని ప్రకటించాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరుతూ ‘కేజీఫ్ చాప్టర్ 2 ఆన్ జులై 16’ పేరిట హ్యాష్ ట్యాగ్ ను వైరల్ చేస్తున్నారు.

ఇదే విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్న యశ్, “డియర్ నరేంద్ర మోదీ సార్, అభిమానుల ఎమోషన్ ను పరిశీలించి, జులై 16ను జాతీయ సెలవుదినంగా ప్రకటించండి” అని కోరారు. దీనికి కొన్ని ఎమోజీలను సైతం జోడిస్తూ, మోదీకి రాసిన లేఖను షేర్ చేశారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండగా, లాక్ డౌన్ సడలింపుల అనంతరం వస్తున్న తొలి అతిపెద్ద చిత్రంగా ఇది నిలువనుంది.

Related Posts

Gallery

Most Popular

Polls

Latest News