కేతిక.! దశ తిరిగిందిక.!

గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ రూటే వేరప్పా.! హీరోయిన్ల విషయంలో త్రివిక్రమ్ వ్యూహాలు ఎవరికీ అర్థం కావు. దురదృష్టమేంటంటే, ఈ విషయమై త్రివిక్రమ్ మీద నానా రకాల గాసిప్స్ వస్తుంటాయి.

పూజా హెగ్దే విషయంలో త్రివిక్రమ్ స్పెషల్ ఇంట్రెస్ట్.. అంటూ జరిగిన ప్రచారం సంగతి తెలిసిందే. అది అటకెక్కింది ‘గుంటూరు కారం’ సినిమాతో. ప్రస్తుతం శ్రీలీలతో త్రివిక్రమ్ గాసిప్స్ ప్రవాహం చూస్తున్నాం.

అనూహ్యంగా సీన్‌లోకి కేతిక శర్మ వచ్చింది. అలాగని ‘గుంటూరు కారం’లో శ్రీలీలనో, మీనాక్షి చౌదరినో త్రివిక్రమ్ తీసెయ్యడంలేదట. కానీ, త్రివిక్రమ్ దృష్టిలో కేతిక శర్మ గట్టిగానే పడిందట. ‘బ్రో’ సినిమా సమయంలో ఏర్పడ్డ పరిచయం, ఇంకో లెవల్‌కి వెళ్ళిందంటున్నారు.

ఇది ఉత్త గాసిప్ మాత్రమేనా.? అంటే, కాదు కాదు.. తదుపరి సినిమాలో ఛాన్స్ ఇస్తానంటూ త్రివిక్రమ్, కేతికకు భరోసా ఇచ్చాడన్నది తాజా ఖబర్. అదే నిజమైతే, కేతిక శర్మ దశ తిరిగినట్లే.

త్రివిక్రమ్ తదుపరి సినిమా అల్లు అర్జున్‌తో.! కానీ, మరో పెద్ద హీరోని కూడా త్రివిక్రమ్ లైన్లో పెట్టాడట.