కీర్తి .. మీరు ఎవ‌రితోనైన క‌మిట‌య్యారా? .. దిమ్మ తిరిగే స‌మాధానం ఇచ్చిన మిస్ ఇండియా

Keerthi Suresh

సోష‌ల్ మీడియా వ‌ల‌న అభిమానుల‌కు, సెల‌బ్రిటీల‌కు మ‌ధ్య దూరం చాలా త‌గ్గింది. మ‌న‌సులోని మాట‌ల‌ని డైరెక్ట్ గా వారి ముందు ఉంచుతున్నారు. అయితే కొన్ని సంద‌ర్భాల‌లో నెట‌జ‌న్స్ వేసే చెత్త ప్ర‌శ్న‌లు వారి మ‌న‌సుకు బాధ క‌లిగించినా కూడా త‌మ‌దైన స్టైల్‌లో జవాబిచ్చి నోరు మూయిస్తున్నారు. రీసెంట్‌గా స‌మంత‌ని ఓ నెటిజ‌న్ చైకి విడాకులు ఇచ్చేయ్ మ‌నం ఇద్ద‌రం పెళ్లి చేసుకుందాం అని ట్వీట్ చేయ‌గా, దానికి స్పందించిన సామ్.. చైని అడుగు అంటూ స్ట‌న్నింగ్ స‌మాధానం ఇచ్చింది.

మ‌హాన‌టితో జాతీయ‌స్థాయి గుర్తింపు తెచ్చుకున్న కీర్తిసురేష్ ప్ర‌స్తుతం లేడి ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తుంది. ఇటీవ‌ల ఆమె న‌టించిన పెంగ్విన్, మిస్ ఇండియా చిత్రాలు ఓటీటీలో విడుద‌ల‌య్యాయి. ఇవి ప్రేక్ష‌కుల‌ని అంత‌గా అల‌రించ‌లేక‌పోయాయి. ప్ర‌స్తుతం తెలుగులో రంగ్ దే, స‌ర్కారు వారి పాట అనే చిత్రాలు చేస్తుంది. అయితే ఛాయ్ , కాపీ బిజినెస్‌ల నేప‌థ్యంలో రూపొందిన మిస్ ఇండియా చిత్రం ప్ర‌మోష‌న్లో భాగంగా కీర్తి నెటిజ‌న్స్‌తో ముచ్చ‌టించింది.

ఓ నెటిజ‌న్ సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ వేదిక‌గా మీరు సింగిలా.. క‌మిట‌య్యారా ? అని ప్ర‌శ్నించాడు. దీనికి కీర్తి సురేష్ చాలా ఇంటిలిజెంట్ సమాధానం ఇచ్చింది. క‌మిటెడ్ టూ వ‌ర్క్ అని కామెంట్ పెట్ట‌డంతో ఆమె చ‌తుర‌త‌కు నెటిజ‌న్స్ ఫిదా అవుతున్నారు. గ‌తంలోను కీర్తి సురేష్‌కు ఇలాంటి ప్ర‌శ్న‌లు ఎదురు కాగా, అప్పుడు కూడా చాలా నెన్సాఫ్ హ్యూమ‌ర్‌ని చ‌క్క‌గా ఉప‌యోగించి బ‌దులు ఇచ్చింది. త్వ‌ర‌లో ఈ అమ్మ‌డు స‌ర్కారు వారి పాట షూటింగ్‌లో పాల్గొనేందుకు యూఎస్ వెళ్ల‌నుంది. ఈ చిత్రం ప‌ర‌శురాం ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతుండ‌గా, ఇందులో మ‌హేష్ ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్నాడు.