వైరల్ : ఎత్తిన సీసా దించకుండా తాగేసిన కీర్తీ.!

తన నటన ఆహార్యంతో టాలీవుడ్ మరియు కోలీవుడ్ సినిమా దగ్గర ఈ నాటి మహానటి గా పేరు తెచ్చుకున్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా కీర్తీ సురేష్ అనే చెప్పాలి. అయితే తన కెరీర్ స్టార్టింగ్ లో కీర్తి కి ఇప్పుడు కనబడుతున్న కీర్తీ కి కొంచెం తేడా అయితే వచ్చింది కానీ ఆమె నటన పరంగా మాత్రం ఎలాంటి తేడా లేదు.

ఆ మధ్య తమిళ్ లో వచ్చిన ఓ సినిమాలో అయితే కీర్తీ సురేష్ నట విశ్వరూపమే చూపించింది. ఇక ఇప్పుడు కూడా దాదాపు అలాంటి డీ గ్లామరస్ రోల్ లోనే చేసిన సినిమా “దసరా”. నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ఈ సినిమాలో కీర్తి సురేష్ చాలా సహజమైన రోల్ లో నటించిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో అయితే రిలీజ్ కానుంది.

కాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో చిత్ర యూనిట్ ఇప్పుడు పాల్గొంటుండగా వారితో పాటుగా కీర్తి సురేష్ కూడా గ్యాప్ లేకుండా ప్రమోషన్స్ ని చేస్తుంది. మరి ఈ ప్రమోషన్స్ లో తాను చేసిన ఓ క్రేజీ పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

దసరా సెట్స్ లో రానా దగ్గుబాటి నాని మరియు కీర్తి లతో ఓ స్పెషల్ ఇంటర్వ్యూ ప్లాన్ చేయగా ఇందులో సినిమాలో నాని చిన్న లిక్కర్ బాటిల్ ని అయితే నోట్లో పెట్టుకొని ఎత్తిన సీసా దించకుండా మొత్తం బాటిల్ ఖాళీ చేస్తాడు. మరి అదే సీన్ ని మళ్ళీ నాని ఈ సెట్ లో రానా తో కలిసి చేశారు.

కానీ షాకింగ్ గా కీర్తి సురేష్ కూడా ఓ బాటిల్ అందుకొని వారు చేసిన తర్వాత వాళ్ళ ముందే చేసి చూపించింది. అంటే దీనితో నాని రానా ఇద్దరూ స్టన్ అయ్యిపోయారు. దీనితో ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. కాగా బాటిల్స్ లో నిజం లిక్కర్ అయితే లేదు కేవలం నీటితో వారి యూనిట్ వారికి అందించారు.