Samantha – Keerthy Suresh: సమంత వల్లే ఈ అవకాశం వచ్చింది: సమంతకు థాంక్స్‌ చెప్పిన కీర్తిసురేష్‌

Samantha – Keerthy Suresh: ‘మహానటి’ సినిమాతో తెలుగుతోపాటు తమిళంలోనూ సూపర్‌ ఫేం సంపాదించుకుంది నేషనల్‌ అవార్డు విన్నింగ్‌ బ్యూటీ కీర్తి సురేశ్‌ . తెలుగు, తమిళంలో వరుస చిత్రాలతో బిజీగా మారిపోయింది. ఇటీవలే బాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. వరుణ్‌ ధావన్‌తో కలిసి ‘బేబీ జాన్‌’ చిత్రంలో నటించింది. ఈ చిత్రం క్రిస్మస్‌ కానుకగా ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ క్రమంలో ‘బేబీ జాన్‌’ చిత్రంలో అవకాశం గురించి మహానటి తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. స్టార్‌ నటి సమంత కారణంగానే తనకు ‘బేబీ జాన్‌’ చిత్రంలో నటించే గొప్ప అవకాశం వచ్చిందని సంతోషం వ్యక్తం చేసింది. ఈ మేరకు సామ్‌కు థ్యాంక్స్‌ చెప్పింది. ‘బేబీ జాన్‌’ చిత్రం ‘తెరి’ సినిమాకు రీమేక్‌గా రూపొందించిన విషయం తెలిసిందే. దీని తమిళ వెర్షన్‌లో హీరోయిన్‌గా సామ్‌ నటించింది. ఈ చిత్రం హిందీ రీమేక్‌ చేయాలని భావించిన చిత్ర బృందం సమంతను సంప్రదించగా.. సామ్‌ తన పేరును సూచించిందని కీర్తి సురేశ్‌ తాజాగా వెల్లడించింది.

తమిళంలో సమంత పోషించిన పాత్రను హిందీలో తాను చేయడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపింది. ఈ సినిమాతో బాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వడం ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి అని పేర్కొంది. ఈ సినిమా కోసం సమంత తన పేరు చెప్పగానే తాను భయపడ్డానని.. అయితే సమంత తనకు ఎంతో మద్దతు ఇచ్చిందని పేర్కొంది. సమంత ఇచ్చిన ధైర్యంతోనే సినిమాను పూర్తి చేశానని చెప్పుకొచ్చింది. ఈ విషయంలో సమంతకు కీర్తి సురేశ్‌ కృతజతలు తెలిపింది.