కీర్తి సురేష్.. మళ్ళీ ఆ రిస్క్ చేస్తానంటోందిట.!

హీరోయిన్ సెంట్రిక్ మూవీస్ ఎందుకో కీర్తి సురేష్‌కి అచ్చిరాలేదు.. ఒక్క ‘మహానటి’ సినిమా తప్ప. దాన్ని మల్టీస్టారర్ అని చెప్పుకోవచ్చేమో కూడా.! ‘మిస్ ఇండియా’, ‘పెంగ్విన్’, ‘గుడ్ లక్ సఖి’.. ఇలా బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ చవిచూసింది కీర్తి సురేష్. కథల ఎంపిక విషయంలో చేసిన పొరపాట్లే ఈ వైఫల్యాలకు కారణమన్నది అందరికీ తెలిసిన విషయమే.

కీర్తి సురేష్ మాత్రం ఏ సినిమాకైనా పూర్తి న్యాయం చేయడానికే ప్రయత్నిస్తుంది. ఈ విషయంలో ఆమెను తప్పు పట్టలేం. ‘చిన్ని’ పేరుతో వచ్చిన ఓ సినిమాలో ఆమె నటన టాప్ క్లాస్.

ఇక, అసలు విషయానికొస్తే తాజాగా ఇంకోసారి రిస్క్ చేయబోతోందట కీర్తి సురేష్. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో హీరోయిన్ సెంట్రిక్ మూవీ తెరకెక్కించేందుకు ‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఓ స్క్రిప్ట్ రెడీ చేశాడని సమాచారమ్.

అయితే, ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్ళేకంటే ముందే ఓ రెండు కమర్షియల్ సినిమాల్ని శ్రీకాంత్ చేయాల్సి వుందట.