ఇండస్ట్రీలో ఒక్కొక్కరూ బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. ఇప్పటివరకు నాగచైతన్య పెళ్లి సందడి జరిగింది ఇకపై కీర్తి సురేష్ పెళ్లి హడావిడి ప్రారంభం అవ్వబోతుంది. ఎందుకంటే ఆమె పెళ్లి డిసెంబర్ 12న జరగబోతుందని అందరికీ తెలిసిందే. తన లాంగ్ టైం బాయ్ ఫ్రెండ్ అయిన ఆంథోనితో ఏడు అడుగులు వేయబోతున్న కీర్తి సురేష్ గురించి ఇప్పుడు ఒక న్యూస్ వైరల్ అవుతుంది.
అదేమిటంటే తన పెళ్లి విషయంలో ఆమె సమంతని ఫాలో అవుతున్నట్లు సమాచారం. సమంత లాగే కీర్తి సురేష్ కూడా గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటుందంట. సమంత అటు క్రిస్టియన్ వివాహ సంప్రదాయం ప్రకారం ఇటు హిందూ సంప్రదాయం ప్రకారం కూడా పెళ్లి చేసుకుంది, అలాగే కీర్తి సురేష్ కూడా రెండు సాంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకోబోతుందని సమాచారం. డిసెంబర్ 12న ఉదయం కీర్తి సురేష్ మెడలో ఆంటోనీ తాళికట్టబోతున్నాడు.
అదేరోజు సాయంత్రం గోవాలోని ప్రముఖ చర్చిలో వీరిద్దరూ ఉంగరాలు మార్చుకోబోతున్నారు. సమంత నాగ చైతన్య పెళ్లి కూడా ఇలాగే జరగటం గమనార్హం. కీర్తి సురేష్ పెళ్లి విషయంలో వీళ్లిద్దరి మధ్య ఉన్న మరొక కామన్ పాయింట్ ఏమిటంటే సమంతదీ ప్రేమ వివాహమే అలాగే కీర్తి సురేష్దీ కూడా ప్రేమ వివాహమే. అయితే ఈ న్యూస్ విన్నప్పటి నుంచి కీర్తి సురేష్ ఫ్యాన్స్ సమంత వివాహ బంధం లా నీ వివాహ బంధం విచ్చిన్నం అవ్వకూడదు అంటూ పోస్టులు పెడుతున్నారు.
ఇక తాజాగా కీర్తి సురేష్ ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ దేవాలయం తిరుమల తిరుపతిని చేరుకొని శ్రీవారిని దర్శించుకుంది. ఇక ఆమె కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం ఆమె నటిస్తున్న బాలీవుడ్ మూవీ బేబీ జాన్ ఇదే డిసెంబర్లో విడుదలకు సిద్ధంగా ఉంది.ఈ సినిమాతోనే ఆమె బాలీవుడ్లో అరంగేట్రం చేస్తున్న సంగతి కూడా అందరికీ తెలిసిందే ఆమె బాలీవుడ్ కెరియర్ అలాగే ఆమె వైవాహిక జీవితం కూడా సూపర్ సక్సెస్ అవ్వాలని కోరుకుందాం.