దర్శకుడిని పరిగెత్తించి పరిగెత్తించి కొట్టింది.. కీర్తి సురేష్‌తో మామూలుగా ఉండదు!!

Keerthy suresh beating Venky Atluri To Take revenge

కీర్తి సురేష్ ప్రస్తుతం రంగ్ దే మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఓ పాట కోసం, కొన్ని సీన్ల కోసం యూనిట్ మొత్తం దుబాయ్‌కి చెక్కేశారని తెలిసిందే. రంగ్ దే మూవీ షూటింగ్ జరుగుతుండగా.. కీర్తి సురేష్ అలా కునుకు తీసింది. ఇక కీర్తి అలా కునుకు తీయడంతో ఆమెకు తెలియకుండా ఆమెతో అలానే సెల్ఫీ తీసుకుని సోషల్ మీడియాలో షేర్ చేసి కీర్తి సురేష్ పరువుతీశారు. ఆ తరువాత అసలు విషయం తెలుసుకున్న కీర్తి బాగా హర్ట్ అయినట్టుంది.

Keerthy suresh beating Venky Atluri To Take revenge

ఓ గుణపాఠం నేర్చుకున్నాను.. సెట్‌లో షూటింగ్ జరుగుతూ ఉండగా నిద్రపోకూడదు. నన్ను అలా ఏడిపిస్తారా? మీ సంగతి చూస్తాను.. మీరు దొరక్కుండా పోరు.. కచ్చితంగా పగ తీర్చుకుంటాను అని కీర్తి సురేష్ శపథం చేసింది. అయితే దర్శకుడు వెంకీ అట్లూరి, హీరో నితిన్‌లను కీర్తి సురేష్ ఏవిధంగా బోల్తా కొట్టిస్తుందో అని అందరూ ఎదురుచూశారు. తాజాగా కీర్తి సురేష్ తన మిషన్‌లో మొదటి లెవెల్‌ను పూర్తి చేసేసింది.

షూటింగ్ గ్యాప్‌లో దర్శకుడు వెంకీ.. కీర్తి సురేష్ చేతికి చిక్కాడు. దర్శకుడిని కీర్తి సురేష్ పరిగెత్తించి మరీ కొట్టింది. గొడుగుతో దాడి చేసేందుకు దర్శకుడి వెంటపడింది. చివరకు దర్శకుడిని దొరకబట్టి తన పగ తీర్చుకుంది. తనకు అసలు జోకర్ క్యారెక్టర్ ఇస్తే బాగుండేదని కీర్తిపై డైరెక్టర్ సెటైర్ వేశాడు. ఇక నితిన్‌ మీద తీర్చుకోవాల్సిన పగ బ్యాలెన్స్ ఉందని, రెడీగా ఉండమని కీర్తి సురేష్ హెచ్చరించింది. ఏది ఏమైనా కీర్తి సురేష్‌తో వ్యవహారం అంతా ఈజీ కాదు.