ఈ ఏడాది టాలీవుడ్ ఇండస్ట్రీలో పెళ్ళిళ్ల హంగామా కొనసాగుతుంది. హీరోలు, హీరోయిన్స్, దర్శకులు, నిర్మాతలు, రచయితలు, టీవీ నటులు ఇలా ఒక్కొక్కళ్ళుగా పెళ్ళిపీటలెక్కారు. కొద్ది రోజుల క్రితం బిగ్ బాస్ సీజన్ 2 ఫేమ్ కూడా వివాహం చేసుకున్నాడు. గతంలో ఇతనికి హర్షిత అనే యువతితో పెళ్ళైంది. ఏదో కారణాల వలన కొద్ది రోజులకే వీరు విడిపోయారు. ఇటీవల డైవర్స్ రావడంతో కాకినాడకు చెందిన శ్రీ లిఖిత అనే యువతిని సామ్రాట్ వివాహం చేసుకున్నాడు. కరోనా వలన తన పెళ్ళి కుటుంబసభ్యులు, బంధువులు, సన్నిహితులు మధ్య జరుపుకున్నారు.
సామ్రాట్- శ్రీలిఖిత పెళ్లికి సంబంధించిన ఫొటోలని ప్రముఖ డిజైనర్, సామ్రాట్ సోదరి శిల్పా రెడ్డి సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ఈ ఫోటోలో సామ్రాట్ ఫ్రెండ్స్ అయిన బిగ్‌బాస్-2 కంటెస్టెంట్స్.. తనీష్, దీప్తి సునయన, అమిత్ తివారి, దీప్తి నల్లమోతు, రోల్ రైడా, శ్యామల, పూజా రామచంద్రన్‌లతో పాటు శివజ్యోతి, రమ్యకృష్ణ తదితరులు కనిపించారు. అయితే సీజన్ 2 విన్నర్ అయిన కౌశల్ ఎక్కడా కూడా కనిపించలేదు. అసలు సామ్రాట్ నుండి కౌశల్‌కు ఇన్విటేషన్ వెళ్లిందా, పిలిచిన కూడా కౌశల్ రాలేదా అనే అంశాలపై ప్రస్తుతం అభిమానులు జోరుగా చర్చలు జరుపుతున్నారు.
టైటిల్ గెలవాలనే ఆశయంతో సీజన్ 2లోకి బరిలోకి దిగిన కౌశల్ ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా ఆడాడు. అందరు గ్రూపులుగా ఆడితే కౌశల్ సోలోగా ఆడి అందరి మనసులు గెలుచుకున్నాడు. మిగతావారు తనని టార్గెట్ చేసినప్పటికీ ఏ మాత్రం అధైర్యపడుకుండా, ఎక్కడా కూడా విచక్షణ కోల్పోకుండా, చాలా ఓపికతో వంద రోజులకి పైగా బిగ్ బాస్‌లో ఉన్నాడు. హౌజ్‌లో ఉన్నవారందరికి మాంచి బాండింగ్ ఏర్పడగా, కౌశల్‌తో మాత్రం అంటిముట్టనట్టు వ్యవహరించేశారు. ఇప్పటికీ ఏదైన పార్టీలు చేసుకున్నా కూడా కౌశల్‌ని మినహాయించి వీరు సెలబ్రేషన్స్ జరుపుకునే వారు. అయితే హౌజ్‌లో రేగిన వివాదం ఇప్పటికీ వాళ్ళ మనస్సులో ఉండే ఉంటుంది. అందుకే కౌశల్‌ని తన పెళ్ళికి సామ్రాట్ ఇన్వైట్ చేసి ఉండరు అంటూ కొందరు నెటిజన్స్ చెబుతున్నారు.