లాస్య ఎలిమినేష‌న్‌తో అంతా షాక్..కారణాలు చెప్పిన కౌశ‌ల్ మందా

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4 వంటలక్క లాస్య 11వ వారం ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. గతవారం నామినేట్ అయిన కంటెస్టెంట్లలో అతి తక్కువగా ఓటింగ్‌ను రావడంతో ఆమె ఎలిమినేట్ అయ్యారు. ఈ క్రమంలో ఆమె ఎలిమినేషన్‌‌పై బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ కౌశల్ మందా తన అభిప్రాయాలను వ్యక్తపరిచారు. బిగ్‌బాస్‌లో ఇంట్లో లాస్య చాలా డీసెంట్‌గా ఆడారని..చిన్నబాబును ఇంట్లో వదిలి బిగ్‌బాస్ ఇంట్లోకి రావడం గొప్ప విషయమని తెలిపారు. కిడ్స్‌ను వదిలి వస్తే ఎంత బాధ ఉంటుందో తనకు తెలుసని.. ప్రెజర్‌ను తట్టుకొని లాస్య ఇప్పటివరకు నెగ్గుకొచ్చారని పేర్కొన్నారు. యాంకర్‌గా పాపులర్ అయిన లాస్యకు ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి మంచి సపోర్ట్ లభించిందని.. ఆమె వేషదారణ, హెమ్లీ లుక్స్‌కి ఎక్కవమంది కనెక్ట్ అయ్యారని చెప్పారరు. ఆమె తన గేమ్‌ను అగ్రెసివ్‌గా ఆడకపోవడం మైనస్‌గా మారిందని కౌశల్ అభిప్రాయపడ్డాడు.

బిగ్‌బాస్ తెలుగు షోలో బలంగా ముందుకు వెళ్లాలంటే కూల్‌గా, సాఫ్ట్‌గా ఆడటం కుదరదని వెల్లడించారు. కాస్త అగ్రెసివ్‌గా, మసాలాలను తన గేమ్‌కు అదనంగా జోడించాలని చెప్పాడు. ఆ విషయంలో లాస్య ఫెయిలయ్యారని… సేఫ్ గేమ్ ఆడటం వల్ల బయటకు రావాల్సి వచ్చిందని వివరించాడు. నేచురల్ గేమ్‌తోపాటు కొంత అగ్రెసివ్ క్యారెక్టర్‌తో ఆడితే వీక్షకులు ఓన్ చేసుకుంటారని…సింపుల‌‌్‌గా, న్యూట్రల్‌గా ఉండటం వలన ఆమె ఎక్కువగా కాంట్రవర్సీలలోకి వెళ్లలేదని, అందుకే ముందుకు వెళ్లలేకపోయిందని అని కౌశల్ మందా చెప్పారు. మాస్ ఎలిమింట్స్ లేకపోయినా ఇంటిలో అందరికీ వంట చేస్తూ లాస్య బాగా చూసుకొన్నారని చెప్పాడు. అభిజిత్, హారిక లాంటి క్లాస్ బ్యాచ్‌తో ప్రయాణించారని, బిగ్ బాస్ షోలో టాప్ 5లో ఉండాలంటే తప్పనిసరిగా కొన్ని మాస్ ఎలిమింట్స్ ఉండాలని వివరించారు. అలాంటి అంశాలకు దూరంగా ఉండటం కారణంగానే ఆమెను ఎక్కువమంది ప్రేక్షకులు ఓన్ చేసుకోలేదని చెప్పాడు.

ఇక టాప్ 5 లో ఎవరుంటారన్న దానిపై కూడా కౌశల్ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. అభిజిత్, సోహెల్, అరియానా, హారిక, అఖిల్, టాప్ 5‌లో ఉంటారని చెప్పాడు. అవినాష్, మోనాల్‌కు ఛాన్స్ ఉన్నప్పటికీ ఇకపై వారు టఫ్ గా ఆడాలని అభిప్రాయడ్డాడు. బిగ్ బాస్ ఇంట్లో మున్ముందు ఏం జరుగుతుందో లెట్స్ వెయిట్ అండ్ సీ.