ఈ ఏడాది ఇండస్ట్రీలో ఎన్నో విషాదాలతో పాటు శుభకార్యాలు జరిగాయి. చాలా మంది స్టార్స్ వాళ్ళ బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పారు. ఇందులో నటులు, నటీమణులు, రచయితలు, దర్శకులు, నిర్మాతలు ఉన్నారు. రీసెంట్‌గా కలువ కళ్ల సుందరి కాజల్ పెళ్లి పీటలెక్కగా , ప్రస్తుతం ఈ అమ్మడు తన భర్తతో హనీమూన్ ఎంజాయ్ చేస్తుంది. ఇక డిసెంబర్ 9న ఉదయ్ పూర్ ప్యాలెస్‌లో నిహారిక .. చైతన్యని వివాహం చేసుకోనుంది. ఈ ఏడాదికి ఇదే చివరి పెళ్లిగా కనిపిస్తుంది.
2020లో కత్తిలాంటి హీరోయిన్ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. నందమూరి కళ్యాణ్‌రామ్ సరసన ‘కత్తి’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన సనాఖాన్. గగనం, మిస్టర్ నూకయ్య లాంటి తెలుగు సినిమాలతో పాటు పలు హిందీ, తమిళ సినిమాల్లోనూ నటించింది. బిగ్‌బాస్ -6 సీజన్లో పాల్గొంది. రీసెంట్‌గా అమ్మడు తాను సినీ ప్రపంచానికి దూరం కాబోతున్నట్టు చెప్పుకొచ్చింది. ఎందుకా అని అందరు ఆలోచిస్తున్న సమయంలో గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ముఫ్తి అనాస్ అనే యువకుడిని ముస్లిం సంప్రదాయం ప్రకారం ఆమె వివాహం చేసుకున్నారు
ప్రస్తుతం సనాఖాన్ పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. పెళ్ళి కుమార్తె దుస్తులలో ఈ అమ్మడిని చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు. ‘నిఖా ముబారక్’ అని రాసి ఉన్న చాక్లెట్ కేక్‌ను సనా ఖాన్, ముఫ్తి కలిసి కట్ చేశారు. కరోనా వలన వీరి పెళ్లి కూడా కొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ అమ్మడుకి కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు , సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.