సౌత్ సినిమాలకి, సౌత్ సినిమా స్టోరీలకి, సౌత్ ఇండియా దర్శకులకి పాన్ ఇండియా లెవెల్లో ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది. కొందరు సౌత్ సినిమాలని బాలీవుడ్ లో రీమేక్ చేస్తే కొందరు సౌత్ ఇండియా దర్శకులతో బాలీవుడ్లో సినిమాలు తీసి ఇండస్ట్రీ హిట్లు అందుకుంటున్నారు. బాలీవుడ్ లో అట్లీ తీసిన జవాన్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే.
ఇప్పుడు అదే బాటలో చాలామంది బాలీవుడ్ స్టార్స్ సౌత్ ఇండియా దర్శకులతో ఇప్పటికే సినిమాలు తీయడం ప్రారంభించారు.ఇప్పుడు మరో తెలుగు సినిమా నార్త్‌లో రీమేక్‌కి రెడీ అవుతోంది. నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన ‘సరిపోదా శనివారం’ సినిమాను హిందీలో రీమేక్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సినిమా హిందీ ప్రేక్షకులను ఓటీటీ ద్వారా అలరించింది. ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ హిందీ వర్షన్‌ను నార్త్‌లో స్ట్రీమింగ్ చేసింది. చాలా మంది ఇప్పటికే చూశారు.
దీన్ని హిందీలో రీమేక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని బాలీవుడ్ రిపోర్ట్. కార్తీక్ ఆర్యన్ హీరోగా సాటర్డే స్టార్ టైటిల్ తో రూపొందిస్తారని సమాచారం. అయితే ఇప్పటికే హిందీ వర్షన్ లో ఓటీటీ లో అందుబాటులో ఉన్న ఈ సినిమాకి మళ్ళీ రీమేక్ అవసరమా, చూసేసిన కధనే మళ్లీ వెండితెరపై చూడటానికి ప్రేక్షకులు ఇష్టపడతారా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు. ఇప్పటికే కార్తీక్ ఆర్యన్ అలవైకుంఠపురం సినిమాని హిందీలో రీమేక్ చేసే అతిపెద్ద పరాభవాన్ని రుచి చూసాడు.
అది ఎంత పెద్ద డిజార్డర్ అంటే కనీసం యావరేజ్ టాక్ కూడా తెచ్చుకోలేదు అలాగే షాహిద్ కపూర్ జెర్సీ సినిమాకి రీమేక్ చేశాడు అది కూడా పెద్ద ఫ్లాప్ ని మూట కట్టుకుంది. అలాగే హిట్ వన్ సినిమాని రాజకుమార్ రావు రీమేక్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాడు.ఇప్పుడు అదే తప్పును కార్తీక్ ఆర్యన్ మరోసారి చేస్తున్నాడు అనే విమర్శలు కొందరు చేస్తున్నా , అస్సలు తగ్గేది లేదు అంటూ ముందుకు వెళ్తున్నాడు. ఏం జరుగుతుందో చూడాలి మరి.