కార్తికేయ సినిమాకి బజ్ పెరిగిందోచ్.!

‘ఆర్ ఎక్స్ 100’ సినిమాతో అనూహ్యంగా స్టార్ అయ్యాడు యంగ్‌స్టర్ కార్తికేయ. మంచి విషయమున్న హీరో అనిపించుకున్నాడు. అలాగే కేవలం హీరో పాత్రలే కాకుండా, విలక్షణమైన పాత్రలతోనూ ఆకట్టుకుంటున్నాడీ యంగ్‌స్టర్.

ఆ మధ్య అజిత్ హీరోగా వచ్చిన ‘వలిమై’లో విలన్‌గా కనిపించి మెప్పించాడు. అయితే, హీరోగా కార్తికేయ గ్రాఫ్ పెరిగినట్లే పెరిగి డల్ అయిపోయింది. వరుసగా ఫ్లాప్స్ రావడంతో మార్కెట్ పూర్తిగా పడిపోయింది.

కార్తికేయ నటిస్తున్న తాజా చిత్రం ‘బెదురులంక 2012’. యుగాంతం నేపథ్యంలో వస్తున్న సినిమా ఇది. టిల్లుగాని గాళ్ ఫ్రెండ్ నేహా శెట్టి ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. కథ పాతదే అయినా కథనంలో ఏదో మ్యాజిక్ చేశారన్న మౌత్ టాక్ బయటికి వచ్చింది.

దాంతో, సినిమాపై బజ్ పెరిగింది. త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇదిలాగే కంటిన్యూ అయ్యి, సినిమా ఓ మోస్తరు హిట్ టాక్ తెచ్చుకున్నా కార్తికేయ మార్కెట్ మళ్లీ పుంజుకునే అవకాశముంది. చూడాలి మరి ‘బెదురులంక 2012’తో కార్తికేయ బౌన్స్ బ్యాక్ అవుతాడేమో.!