తలైవా రజనీకాంత్ ఈ ఏడాది జైలర్‌తో భారీ విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఆయన కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో ‘లాల్ సలామ్’ చేస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం విడుదల కానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన పనులు జరుగుతున్నాయి.
విష్ణు విశాల్, విక్రాంత్ తో పాటు ఓ కీలక పాత్రలో మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ కూడా నటించారు. ఇటీవల కపిల్ దేవ్ డబ్బింగ్ కూడా చెప్పారు. ఆ ఫొటోలను నెట్టింట షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోలను షేర్‌చేసిన లైకా సంస్థ లెజెండరీ స్పోర్ట్స్ మ్యాన్ మా సినిమాలో నటించడం గౌరవంగా భావిస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. కపిల్‌దేవ్‌తో పాటు ఈ చిత్రంలో జీవిత రాజశేఖర్ కూడా ఉన్నారు.
ఇందులో రజనీకాంత్ సోదరిగా ఆమె కనిపించనున్నారు. నిరోషా, తంబి రామయ్య, సెంథిల్, తంగదురై సహాయక పాత్రలు పోషిస్తున్నారు. ం.ఖీ.రెహ్మాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. కపిల్‌దేవ్ గురించి రజనీకాంత్ ఓ సందర్భంలో చెప్పుకొచ్చిన విషయాలు.. ’భారత మాజీ క్రికెటర్, 1983 ప్రపంచ కప్ కెప్టెన్ (విజేత) కపిల్ దేవ్ ఈ చిత్రంలో నటించడం చాలా సంతోషం. క్రికెట్ లెజెండ్‌తో కలిసి పనిచేయడం నాకు గౌరవప్రదమైన క్షణం. కపిల్ దేవ్ అతని చారిత్రాత్మక విజయాలను ఎప్పటికీ మరిచిపోలేం.’ అని రజనీ అన్నారు.