‘కంగువ’ షూటింగ్‌ పూర్తి

సూర్య కథానాయకుడిగా నటిస్తున్న పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామా ’కంగువ’. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దిశాపటానీ కథానాయిక. బాబీడియోల్‌ విలన్‌ పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం అప్డేట్‌ను సూర్య అభిమానులతో పంచుకున్నారు.

ఈ సినిమా చిత్రీకరణ పూర్తయినట్లు సోషల్‌ విూడియా వేదికగా ప్రకటించారు. ’కంగువ’లో నా చివరి షాట్‌ పూర్తయింది. ఒక ముగింపు, మరెన్నో గొప్ప ప్రారంభాలకు పునాది వేస్తుంది. వెండితెరపై ’కంగువ’ను చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.

గొప్ప దృశ్యకావ్యాన్ని ఆవిష్కరించిన శివకు నా ధన్యవాదాలు’ అని సూర్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా సూర్య స్టిల్‌ను మేకర్స్‌ షేర్‌ చేశారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.