కమల్‌ మరో సినిమాతో రెడీ!

ఉలగనాయగన్‌ కమల్‌ హాసన్‌ మరో సినిమాకు సైన్‌ చేశారు. చాలా గ్యాప్‌ తర్వాత వచ్చిన ‘విక్రమ్‌’ సినిమా కమల్‌ హాసన్‌లో ఎనర్జీని నింపడంతో.. ఇక వరసగా సినిమాలు చేస్తానని ప్రకటించిన ఈ యూనివర్సల్‌ స్టార్‌.. చెప్పినట్లుగానే వరసగా సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారు.

ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు మణిరత్నం డైరెక్షన్‌లో మోస్ట్‌ అవైటెడ్‌ గ్యాంగ్‌ స్టర్‌ యాక్షనర్‌ ’థగ్‌ లైఫ్‌’ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ జరుపుకుంటోంది. మరోవైపు కమల్‌ హాసన్‌ మోస్ట్‌ ఎవైటెడ్‌ పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ కు సంబధించిన ఓ క్రేజీ అప్డేట్‌ ఇచ్చారు. ప్రముఖ యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌లు అన్బరివ్‌(అన్బుమణి, అరివుమణి) దర్శకత్వం వహిస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.

ఈ విషయాన్ని కమల్‌ హాసన్‌ తెలియజేస్తూ.. ’ఇద్దరు ప్రతిభావంతులు, వారి కొత్త అవతార్‌లో దర్శకులుగా చేరడం గర్వంగా ఉంది. మాస్టర్స్‌ అన్బరివ్‌ రాజ్‌ కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌కి తిరిగి స్వాగతం’ అని ట్వీట్‌ చేశారు.

ప్రస్తుతం ఆయన చేసిన ఈ ట్వీట్‌ వైరల్‌ అవుతోంది.కమల్‌ హాసన్‌, ఆర్‌ మహేంద్రన్‌ తమ రాజ్‌ కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే మేకర్స్‌ తెలియజేయనున్నారు.