‘కలియుగం పట్టణం’లో… కొత్త తరం మూవీ!

నాని మూవీ వర్క్స్‌, రామా క్రియేషన్స్‌ ఆధ్వర్యంలో విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్‌ హీరోహీరోయిన్లుగా ’కలియుగం పట్టణంలో’ అనే ఓ డిఫరెంట్‌ మూవీ రాబోతోంది. కందుల గ్రూప్‌ విద్యా సంస్థల మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కందుల చంద్ర ఓబుల్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి కథ, డైలాగ్స్‌ ,స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం ఇలా అన్ని బాధ్యతలను రమాకాంత్‌ రెడ్డి చూసుకుంటున్నారు. రమాకాంత్‌ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ డాక్టర్‌ కందుల చంద్ర ఓబుల్‌ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌లు కలిసి సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. మార్చి 22న రాబోతోన్న ఈ మూవీలో చిత్రా శుక్లా ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. ఇక ఈ మూవీ టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నటకిరీటి రాజేంద్ర ప్రసాద్‌ మాట్లాడుతూ.. ‘ఆ నలుగురు’ సినిమాలో అప్పడాలు అమ్మి పెట్టడంలో నా గురువుగా ఆరేళ్ల వయసులోనే విశ్వ కార్తికేయ నాతో పాటు నటించాడని.. ఇప్పుడు హీరోగా నటించాడన్నారు. కొత్త పాయింట్‌తో ఈ చిత్రం రాబోతోందని అర్థం అవుతోందని.. ‘కలియుగం పట్టణం’లో అనే టైటిలే చాలా వినూత్నంగా ఉందన్నారు. మార్చి 22న ఈ చిత్రం రాబోతోందని.. ఈ సినిమాను పెద్ద సక్సెస్‌ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

డైరెక్టర్‌ త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ.. ‘కలియుగం పట్టణంలో టీజర్‌ నాకు చూపించారు. నాకు చాలా నచ్చింది. ఏదో చిన్న సినిమా అనుకున్నా.. కానీ హై స్టాండర్డ్‌లా అనిపించింది. విశ్వ కార్తికేయ, ఆయుషి జంట చక్కగా ఉంది. ఈ చిత్రం పెద్ద హిట్‌ ఇవ్వాలి. దర్శక నిర్మాతలకు మంచి పేరు రావాలి.’ అని అన్నారు.

డైరెక్టర్‌ రమాకాంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. ‘మా కలియుగం పట్టణంలో సినిమాను ఆశీర్వదించడానికి వచ్చిన మీడియాకు థాంక్స్‌. నా సినిమా టీంకు థాంక్స్‌. మిగతా విషయాలన్నీ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో మాట్లాడతాను’ అని అన్నారు.