పెళ్లి తర్వాత కూడా కెరీర్‌ని ఎంతో స్ట్రాంగ్‌గా బిల్డప్ చేసుకుంటోంది చందమామ కాజల్ అగర్వాల్. ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులు టేకప్ చేసింది. ఆ షూటింగ్స్‌లో ప్రస్తుతం బిజీగా గడుపుతోంది కాజల్ అగర్వాల్. ఇదిలా వుంటే, ఓ యంగ్ హీరో తన సినిమా కోసం కాజల్ అగర్వాల్‌ని సంప్రదించాడట. గతంలో కాజల్‌తో కలిసిన నటించాడు ఆ యంగ్ హీరో.
తాజా సినిమా కోసం కాజల్‌ని సంప్రదించాడట. అయితే, ఇప్పుడు కొన్ని అబ్జక్షన్స్ పెట్టిందట కాజల్ అగర్వాల్. ముఖ్యంగా రొమాంటిక్ సీన్స్.. ఆ సీన్స్‌లో నటించడానికి ఒప్పుకోనని చెప్పేసిందట.
కేవలం డిగ్నిఫైడ్ రోల్స్ మాత్రమే చేస్తానని చెప్పిందట. అలాగైతే కెరీర్ మీద ఆశలు వదిలేసుకోవడమే అంటున్నారు. పెళ్లి తర్వాత కూడా బాలీవుడ్ ముద్దుగుమ్మలు దీపికా పదుకొనె తదితర భామలు రొమాంటిక్ సీస్స్‌లో నిరభ్యంతరంగా నటించేస్తున్నారు.
కానీ, కాజల్ మాత్రం హద్దులు పెట్టుకుంది. ఇలా అయితే, సెలెక్టివ్‌గా మాత్రమే ఆఫర్లు అందుకోవల్సి వస్తుంది చందమామా.1 అంటున్నారు సినీ జనం.