సినీ పరిశ్రమలో మరో విషాదం.. జూనియర్‌ బాలయ్య మృతి

సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకున్నది. తమిళ సీనియర్‌ నటుడు టీఎస్‌ బాలయ్య కొడుకు జూనియర్‌ బాలయ్య (70) కన్నుమూశారు. ఈరోజు ఉదయం చెన్నైలో తుది శ్వాస విడిచారు. 70 ఏళ్ల వయసున్న బాలయ్య శ్వాస సంబంధింత సమస్యతో బాధపడుతు మృతి చెందారు.

ఇక జూనియర్‌ బాలయ్య మరణ వార్తతో కోలీవుడ్‌ సినీ ఇండస్ట్రీలో విషాదం అలుముకుంది. పలు సినీ ప్రముఖులు ఆయన మృతికి నివాళులర్పిస్తున్నారు. టీఎస్‌ బాలయ్య నట వారసుడిగా ఫిల్మ్‌ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు జూనియర్‌ బాలయ్య. ఇక నటుడిగా జూ. బాలయ్య ఎంట్రీ ఇచ్చిన మూడు రోజులకే అయన తండ్రి టీఎస్‌ బాలయ్య మరణించాడు.

అయితే తండ్రి మరణం తర్వాత బాలయ్య కెరీర్‌ అనుకున్నంత మంచిగా సాగలేదు. సినిమాలైతే చేశాడు కానీ జూనియర్‌ బాలయ్య తన తండ్రి స్థాయిని అందుకోవడంలో విఫలమయ్యాడు. అతను చివరగా విజయ్‌ పులి, అజిత్‌ నేరకోండా పార్వై లాంటి సినిమాల్లో నటించాడు.