హాలీవుడ్‌ యాక్షన్‌ మూవీ ‘జోకర్‌’కు సీక్వెల్‌!

హాలీవుడ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘జోకర్‌’ సినిమాకు సీక్వెల్‌ రానున్న విషయం తెలిసిందే. ‘జోకర్‌: ఫోలీ ఏ డీక్స్‌’ అంటూ ఈ సినిమా రానుండగా.. టాడ్‌ ఫిలిప్స్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకున్న ఈ చిత్రం గ్రాఫిక్స్‌ పనుల్లో బిజీగా ఉంది. రీసెంట్‌గా ఈ సినిమా నుంచి ఫస్ట్‌ లుక్‌ విడుదల చేయగా.. జోక్విన్‌ ఫీనిక్స్‌తో పాటు పాప్‌స్టార్‌ లేడీగా కనిపించి అలరించారు.

ఇదిలావుంటే తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్‌ టీజర్‌ విడుదల చేశారు. ఇక ఈ టీజర్‌ గమనిస్తే.. జైల్‌లో ఉన్న జోకర్‌కి లేడిగా పరిచయం అవుతుంది. వీళ్ల పరిచయం ప్రేమగా ఎలా మారింది..?. ఆ తర్వాత ఏం జరిగింది? అనే స్టోరీతో ఈ సినిమా రాబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ మూవీ సంగీత నేపథ్యంలో రానున్నట్లు టీజర్‌ చూస్తే అర్థమవుతుంది. ఈ చిత్రం అక్టోబరు4, 2024న థియేటర్లలోకి రానుంది.