‘జవాన్‌?’ ఖాతాలో అరుదైన రికార్డు..!

బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ఖాన్‌ నటించిన ‘జవాన్‌’ సినిమా రోజుకో సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తోంది. విడుదలైన రోజు నుంచే థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతున్న ఈ సినిమా ఆరో రోజుఅన్ని భాషలకు కలిపి రూ. 28.50 కోట్లు వసూలు చేసింది. మొదటి రోజు రూ. 75 కోట్లు కలెక్ట్‌ చేసిన ఈ మూవీ ఆ తర్వాత రూ. 53.23 కోట్లు, రూ.77.83 కోట్లు, రూ.80.1 కోట్లు, రూ.32.92 కోట్లు, రూ.30 కోట్లు ఇలా పెద్ద మొత్తంలో వసూలు చేస్తూ బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది.

ఈ క్రమంలోఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ రూ. 574.89 కోట్లకు పైగా వసూలు చేసి 600 కోట్ల క్లబ్‌?లోకి చేరేందుకు సిద్ధమైంది. భారీ అంచనాలు క్రియేట్‌ చేస్తూ ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘జవాన్‌’ సినిమాకు థియేటర్లలో పాజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. ఇందులో షారుక్‌ లుక్‌ కొత్తగా ఉందని, యాక్షన్‌ సీన్స్‌ అదిరిపోయాయంటూ సినిమా చూసిన నెటిజన్లు సోషల్‌ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు.

ఇక ఈ సినిమాలో షారుక్‌కు జోడీగా తమిళ లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార నటించగా.. విజయ్‌? సేతుపతి, సీనియర్‌ నటి ప్రియమణి , బాలీవుడ్‌ నటి సాన్యా మల్హోత్రా, యోగిబాబు, సునీల్‌ గ్రోవర్‌ లాంటి స్టార్స్‌ కీలక పాత్రల్లో కనిపించి ఆడియెన్స్‌ను మెప్పించారు. దీపికా పదుకొణె, సంజయ్‌ దత్‌ లాంటి స్టార్స్‌ అతిథి పాత్రల్లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మ్యూజిక్‌ సెన్సేషన్‌ అనిరుధ్‌ రవిచందర్‌ ఈ సినిమాకు సంగీతం అందించగా.. రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌ మెంట్‌ బ్యానర్‌ పై గౌరీ ఖాన్‌ ఈ సినిమాను నిర్మించారు.