ఎన్టీఆర్ సినిమాకి భారీ కండిషన్లు పెట్టిన జాన్వీ కపూర్ … కాస్త ఓవర్ అనిపించలేదా?

బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా కొనసాగుతున్నటువంటి
జాన్వీ కపూర్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆశించిన స్థాయిలో హిట్ అందుకోలేకపోయారు. ఈమె వరుస సినిమాలలో నటిస్తున్నప్పటికీ ప్రతి ఒక్క సినిమా కూడా పరవాలేదు అనిపించినప్పటికీ పెద్దగా సక్సెస్ సాధించినది లేదు.అయితే తనకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు వస్తే తప్పకుండా చేస్తానని ఎన్నో మార్లు వెల్లడించింది. ముఖ్యంగా ఎన్టీఆర్ విజయ్ దేవరకొండ అల్లు అర్జున్ వంటి వారి సరసన నటించే అవకాశం వస్తే ఏమాత్రం వదులుకోనని చెప్పినా ఈమెకు ఏకంగా ఎన్టీఆర్ కొరటాల శివ సినిమాలో నటించే అవకాశం వచ్చిందని వార్తలు వస్తున్నాయి.

త్వరలోనే ఈ విషయం గురించి అధికారకంగా ప్రకటించనున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల వాయిదా పడుతూ వచ్చింది. అయితే వచ్చే నెల నుంచి కొరటాల ఎన్టీఆర్ కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులను జరుపుకుంటుందని వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కాబోతుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో నటించడం కోసం జాన్వీ భారీగా కండిషన్లు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.

ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమాకి సైన్ చేయాలంటే తన కండిషన్లకు ఒప్పుకోవాలని ముందుగానే చెప్పారట.తనకు స్క్రిప్ట్ మొత్తం ముందుగానే ఇవ్వాలని ఈమె కండిషన్ పెట్టారట. అంతేకాకుండా సినిమాకు కమిట్ అయిన తర్వాత స్క్రిప్ట్ విషయంలో ఎలాంటి మార్పులు ఉండకూడదని అలాగే తాను నటించిన ప్రతి ఒక్క సీన్ సినిమాలో ఉండాలని కండిషన్ పెట్టారట. అంతేకాకుండా తన రెమ్యూనరేషన్ కాకుండా తన స్టాఫ్ కి మొత్తం ఖర్చులను మేకర్స్ భరించాలని చెప్పారట. ఈ సినిమా కోసం జాన్వి ఏకంగా నాలుగు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు సమాచారం.