‘పుష్ప-2’ చిత్రానికి జాన్వీకపూర్‌ అండ!

అల్లు అర్జున్‌ నటించిన ‘పుష్ప 2’ సినిమాకు హాలీవుడ్‌ చిత్రం ‘ఇంటర్‌స్టెల్లార్‌’ సినిమాకు సంబంధించి ఉత్తరాదిలో వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. హాలీవుడ్‌ దర్శకుడు క్రిస్టోఫర్‌ నోలాన్‌ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘ఇంటర్‌స్టెల్లార్‌’. 2014లో విడుదలైన ఈ చిత్రం హలీవుడ్‌లోనే కాకుండా ఇండియాలోనూ మంచి కలెక్షన్లు సాధించింది.

అయితే ఈ సినిమా 10 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా మేకర్స్‌ రీ రిలీజ్‌ ప్లాన్‌ చేశారు. ఈ సినిమాను ఐమాక్స్‌ వెర్షన్‌ మాత్రమే రిలీజ్‌ చేయనుండగా.. ఇండియాలో కాకుండా వరల్డ్‌ వైడ్‌గా విడుదల చేస్తుంది చిత్రబృందం. దీనికి ముఖ్య కారణం ఇండియన్‌ ఐమాక్స్‌ల్లో ‘పుష్ప 2’ ఉండటం. దీంతో ఇండియన్స్‌కు అసలు సినిమాలు చూడడం రాదని.. సైన్స్‌ ఫిక్షన్‌ వదిలేసి మాస్‌ సినిమాలకు ఎంకరేజ్‌ చేస్తున్నారని కొందరూ కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. అయితే ఈ వివాదంపై బాలీవుడ్‌ నటి జాన్వీ కపూర్‌ స్పందిస్తూ.. ‘పుష్ప2’ సినిమాకు మద్దతుగా నిలిచింది.

జాన్వీ మాట్లాడుతూ.. ‘పుష్ప 2’ కూడా ఒక సినిమానే కదా.. ‘ఇంటర్‌స్టెల్లార్‌’ సినిమాతో ఈ సినిమాను పోలుస్తూ ఎందుకు తక్కువ చేస్తున్నారు. ఏ హాలీవుడ్‌ సినిమాను మీరు సపోర్ట్‌ చేస్తున్నారో వాళ్లే ఇప్పుడు ఇండియన్‌ సినిమాల గురించి చర్చించుకుంటున్నారు.. ప్రశంసలు కురిపిస్తున్నారు. కానీ మనం మాత్రం మన సినిమాలను తక్కువ చేసుకుంటూ మనల్ని మనమే అవమానించుకుంటూ ఉండిపోతున్నాం. ఇలాంటివి చూసినప్పుడు బాధగా ఉంటుంది అంటూ జాన్వీ రాసుకొచ్చింది. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్‌ వైరల్‌గా మారింది.