ఆ పని చేయకపోతే రోజు పూర్తి కానట్టే ఉంటుంది.. జాన్వీ కపూర్ సెన్సేషనల్ కామెంట్స్

జూనియర్ శ్రీదేవీ జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో చేసే అల్లరి అంతా ఇంతా కాదు. సినిమాలతో అంత ఫేమస్ కాకపోయినా సోషల్ మీడియా ద్వారా స్టార్ స్టేటస్ సొంతం చేసుకుంది. జాన్వీ కపూర్ నటించిన సినిమాలన్నీ దారుణంగా బెడిసికొడుతున్నాయి. అయితే శ్రీదేవీ మ్యానియాతో జాన్వీ కపూర్ దూసుకుపోతోంది. జూనియర్ శ్రీదేవీ అంటూ అభిమానులు ఆమెను ఆరాధిస్తున్నారు.

Janhvi Kapoor About Annoying Khushi Kapoor
Janhvi Kapoor About Annoying Khushi Kapoor

జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో వచ్చే నెగెటివ్ కామెంట్లను ఎంతో సుతిమెత్తగా తిప్పి కొడుతుంది. తన ఫోటోలకు అసభ్యకరంగా కామెంట్లు పెట్టే నెటిజన్లకు అదిరిపోయే సెటైర్లను వేస్తుంది. ఇక జాన్వీ బయట ఎక్కడైనా కనిపిస్తే అక్కడంతా సందడి సందడిగా ఉంటుంది. చిన్న పిల్లలను జాన్వీ స్పెషల్‌గా ట్రీట్ చేస్తూ ఉంటుంది.

Janhvi Kapoor About Annoying Khushi Kapoor
Janhvi Kapoor About Annoying Khushi Kapoor

అయితే జాన్వీ కపూర్ తన ముద్దుల చెల్లెలు ఖుషీ కపూర్ గురించి నిత్యం ఏదో ఒక అప్డేట్ ఇస్తూనే ఉంటుంది. ఈ దీపావళికి ఈ ఇద్దరూ బాగానే ఎంజాయ్ చేసినట్టు కనిపిస్తున్నారు. తాజాగా ఖుషీ కపూర్ ఒళ్లో జాన్వీ కూర్చుని చెల్లిన ఆటపట్టింది. ఈ మేరకు ఆమె చేసిన కామెంట్లు కూడా వైరల్అవుతున్నాయి. నా చెల్లిని విసిగించకపోయినా ఏడిపించకపోయినా నాకు ఆరోజు పూర్తి అయినట్టు అనిపించదు.. ఏదో అసంతృప్తిగా ఉన్నట్టు ఉంటుందని చెప్పుకొచ్చింది.