లీక్ : “గుంటూరు కారం” లో “జల్సా” లాంటి సీన్?

ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్నటువంటి పలు క్రేజీ చిత్రాల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో ప్లాన్ చేస్తున్న హ్యాట్రిక్ మాస్ చిత్రం “గుంటూరు కారం” కూడా ఒకటి. కాగా ఈ చిత్రం షూటింగ్ మళ్ళీ చాలా రోజులు తర్వాత స్టార్ట్ చేయగా ఇప్పుడు నాన్ స్టాప్ గా అయితే షూటింగ్ కంటిన్యూ అవుతుంది.

అయితే ఈ చిత్రాన్ని దర్శకుడు త్రివిక్రమ్ తన మార్క్ ఎమోషన్స్ ని కూడా ఈ సినిమాలో చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే త్రివిక్రమ్ చేసిన చిత్రాల్లో మంచి క్లాసిక్ అయ్యిన చిత్రం “జల్సా” కూడా ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమాలో మంచి ఎమోషన్స్ కూడా ఉంటాయి.

అయితే ఆ సినిమాలో పవన్ తన తల్లిదండ్రులని పోగొట్టుకొని తన ఇంటి ముందు దిగాలుగా కూచున్న సీన్ చాలా మందికి గుర్తుండి ఉండవచ్చు. అయితే సేమ్ అదే రీతిలో మహేష్ పై రెడ్ షర్ట్ నార్మల్ ప్యాంటు మరియు చెప్పులతో ఓ మిడిల్ క్లాస్ అబ్బాయిలా కనిపిస్తున్న ఓ పిక్ ఇప్పుడు గుంటూరు కారం సినిమా నుంచి లీక్ అయ్యింది.

దీనితో ఈ లీక్ అయ్యిన పిక్ చూస్తే మాత్రం జల్సా సినిమాలో పవన్ సీన్ చాలా మందికి గుర్తొచ్చింది. దీనితో ఆ రెండు ఫోటోలు పెట్టి సోషల్ మీడియాలో కంపేర్ చేస్తూ త్రివిక్రమ్ మళ్ళీ మంచి హార్డ్ హిట్టింగ్ ఎమోషనల్ సీన్ అయితే మహేష్ తో ప్లాన్ చేస్తున్నాడా అని టాక్ మొదలైంది.

అయితే అది ఎమోషనల్ సీన్ కాదు అని ఫైట్ సీన్ నుంచి అన్నట్టు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ మాత్రం ఈ లీక్ ఇప్పుడు వైరల్ గా మారింది. కాగా ఈ చిత్రంలో శ్రీ లీల మెయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా మీనాక్షి చౌదరి మరో హీరోయిన్ గా ఎంటర్ అవ్వనుంది.