మహేష్ బాబు కోసం హాలీవుడ్ నటుడిన పట్టుకొచ్చిన జక్కన్న..?

టాలీవుడ్ ఇండస్ట్రీ ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేసిన గొప్ప దర్శకుడు రాజమౌళి. ఈయన దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలు అన్ని బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి. ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలై రికార్డు స్థాయిలో కలెక్షన్లు వసూలు చేసి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో సినిమా రాబోతోంది . ఇప్పటికే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన కూడా విడుదల అయింది.

ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ లో మహేష్ బాబు బిజీగా ఉన్నాడు. ఆ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా షూటింగ్ లో పాల్గొననున్నాడు. మహేష్ రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఇక తాజాగా అందుతున్న ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం మహేష్ బాబు కోసం రాజమౌళి హాలీవుడ్ నటుడిని తీసుకు వస్తున్నట్లు సమాచారం.

‘థోర్’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన
క్రిస్ హెమ్స్‌వర్త్ వంటి ప్రముఖ హాలీవుడ్ నటుడిని మహేష్ బాబు సినిమా కోసం తీసుకు వస్తున్నట్లు సమాచారం. ఇలా హాలీవుడ్ నటుడిని తీసుకువచ్చి మహేష్ బాబు సినిమాని దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా రాజమౌళి ప్రేక్షకులకి పరిచయం చేయబోతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మహేష్ అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. అయితే ఈ విషయం గురించి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ విషయంలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే కొంతకాలం ఎదురు చూడాల్సిందే.