జక్కన్న – మహేష్.. మరో బాలీవుడ్ స్టార్

గత కొద్ది కాలంగా టాలీవుడ్​లో నటించేందుకు బాలీవుడ్​ తారలు ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుటీకే రీసెంట్​గా ఆలియా భట్​, సల్మాన్ ఖాన్, సంజయ్​ దత్​ అనుపమ ఖేర్​​ సహా పలువురు తారలు నటించగా.. ప్రస్తుతం బాబీ డియోల్​ హరిహర వీరమల్లులో నటిస్తున్నారు. అయితే తాజాగా మరో స్టార్ హీరో కూడా తెలుగులో నటించేందుకు సిద్ధమవుతున్నారని ప్రస్తుతం వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరెవరో కాదు మిస్టర్​ ఫర్​ఫెక్షనిస్ట్​ ఆమిర్ ఖాన్. ఈయన మహేశ్​-రాజమౌళి కాంబోలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమాలో నటించనున్నారని ప్రచారం సాగుతోంది. మరి ఇందులో నిజమెంతో తెలియదుగానీ ఈ విషయాన్ని నెటిజన్లు సోషల్​మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు.

ఇకపోతే గతంలో ఆమిర్ కూడా.. రాజమౌళి దర్శకత్వంలో ఎలాంటి పాత్ర వచ్చిన చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. తెలుగు స్టార్స్​తో కలిసి నటించడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు జక్కన్న.. సూపర్ స్టార్ మహేశ్​ బాబు సినిమాలో ఓ ఇంట్రెస్టింగ్​ రోల్ కోసం అమీర్ ఖాన్​ను సంప్రదించినట్లు టాక్ వినిపిస్తోంది. ఇక అమీర్ ఖాన్ కూడా ఒప్పుకున్నాడనే ప్రచారం నడుస్తుంది. అలా ఈ వార్త ప్రస్తుతం టాలీవుడ్​లో ఆసక్తికరంగా మారింది. అయితే ఈ ప్రచారం నడుస్తున్నప్పటికీ మరో వాదన కూడా వినిపిస్తోంది.

ఆమిర్​ ఖాన్​ ఈ చిత్రంలో నటిస్తాడనే నమ్మకం లేదనే ప్రచారం కూడా జరుగుతోంది. అసలే ఆయన భిన్నమైన కథలు, పాత్రలు చేయడానికే ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. ఆయన సినిమాలు బాక్సాఫీస్​ వద్ద భారీ స్థాయిలో కలెక్షన్లను అందుకుంటుంటాయి. అలాంటప్పుడు ఆయన కమర్షియల్​గా రూపొందే జక్కన్న సినిమాలో ఎందుకు నటిస్తాడనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఇకపోతే ఆయన నుంచి రీసెంట్​గా వచ్చిన లాల్ సింగ్ చద్ధా మాత్రం ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఆయన కొంత కాలం పాత్ర సినిమాలకు తాత్కాలికంగా విరామం కూడా ప్రకటించాడు. కుటుంబంతో సరదాగా గడపనున్నట్లు వెల్లడించాడు. మరి ఆమిర్​ మళ్లీ సినిమాల్లో నటించేందుకు సిద్ధమైతే.. అప్పుడు సోలోగా రెడీ అవుతాడా లేదా అనేది చూడాలి.