ఈ ఏడాది తమిళ సినిమా నుంచి ఇంకా సరైన భారీ సినిమా కానీ అదిరే హిట్ కానీ ఇంకా పడలేదు అని చెప్పాలి. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన స్టార్ హీరోలు అజిత్, విజయ్ ల చిత్రాలు కంటెంట్ పరంగా యావరేజ్ గా మాత్రమే నిలిచాయి. ఇక నెక్స్ట్ వచ్చిన పాన్ ఇండియా చిత్రం “పొన్నియిన్ సెల్వన్ 2” కూడా ప్లాప్ గానే నిలిచింది.
కానీ ఎట్టకేలకి కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ వంతు రావడంతో అన్నీ రికార్డ్స్ ఇప్పుడు బ్రేక్ అయ్యినట్టుగా సినీ వర్గాలు చెప్తున్నాయి. మరి తమిళ సినిమా బాక్సాఫీస్ ట్రాకర్స్ రివీల్ చేసిన నంబర్స్ ప్రకారం ఈ చిత్రం ఏకంగా 95 కోట్లకి పైగా గ్రాస్ ని వసూలు చేసింది అట.
మరి ఇదొక మైండ్ బ్లాకింగ్ నెంబర్ కాగా వరుసగా వసూళ్లు ఏరియాస్ వారీగా చూస్తే మొదట తమిళనాడులో 24 కోట్లు, తెలుగు స్టేట్స్ లో 12 కోట్లు, కర్ణాటక 11.5 అలాగే కేరళ రెస్టాఫ్ ఇండియా కలిపి సుమారు 12 కోట్లు అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి భారీ లెవెల్లో 40 కోట్లు వసూలు అయ్యాయి.
దీనితో ఇంచుమించు ఈ చిత్రం ఏకంగా 100 కోట్ల మార్క్ దగ్గరకి వచ్చేసింది. దీనితో తమిళ్ ఇండస్ట్రీలో టాప్ 1 నుంచి 3 వరకు కూడా రజినీకాంత్ సినిమాలే హైయెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్నవిగా నిలిచాయి. దీనితో ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ తో రజినీ మళ్ళీ తన నెంబర్ 1 స్థానంలోకి వచ్చారని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా కాకుండా ఇంపార్టెంట్ రోల్ లో కనిపించగా మరికొంతమంది స్టార్ లు మోహన్ లాల్, శివ రాజ్ కుమార్, సునీల్ లు ముఖ్య పాత్రల్లో నటించారు.