కర్ణాటకలో రేర్ ఫీట్ కొట్టిన “జైలర్”..!

తమిళ సినిమా దగ్గర ఈ ఏడాది భారీ హిట్ అయ్యిన పలు చిత్రాల్లో రికార్డు గ్రసింగ్ హిట్ అయ్యిన చిత్రం “జైలర్” కూడా ఒకటి. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ అలాగే కన్నడ నటుడు నమ్మ శివన్న లు ముఖ్య పాత్రల్లో దర్శకుడు నెల్సన్ తెరకెక్కించిన క్రేజీ మల్టీ స్టారర్ చిత్రమే “జైలర్”.

మరి ఈ సినిమా రజిని కెరీర్ లో రెండో బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలవడమే కాకుండా ఈ ఏడాది తమిళ సినిమా దగ్గర హైయెస్ట్ గ్రాసింగ్ సినిమాగా అయితే నిలిచింది. దీనితో మళ్ళీ రజినీకాంత్ ఓ మాసివ్ కం బ్యాక్ ని ఇచ్చినట్టు అయ్యింది. కాగా ఈ భారీ చిత్రం నెల లోనే ఓటిటి లోకి వచ్చేసింది.

అయినా కూడా కర్ణాటక రాష్ట్రంలో ఓ క్రేజీ రికార్డు కొట్టినట్టుగా కన్నడ సినీ వర్గాలు చెప్తున్నాయి. దీనితో ఈ సినిమా మొత్తం మూడు భాషల్లో అక్కడ 50 రోజుల రన్ ని సూపర్ సక్సెస్ గా కంప్లీట్ చేసుకుందట. తెలుగు సహా తమిళ్ మరియు కన్నడ ఇలా మూడు భాషల్లో ఈ చిత్రం కర్ణాటకలో 50 రోజు రన్ ని కంప్లీట్ చేసుకుందట.

దీనితో ఈరోజుల్లో అందులోని ఓటిటిలో వచ్చాక కూడా రన్ అవడం ఓ రేర్ ఫీట్ అని కన్నడ సినీ వర్గాలు చెప్తున్నాయి. దీనితో జైలర్ మాత్రం అదరగొట్టింది అని చెప్పాలి. ఇంకా ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించగా సన్ పిక్చర్స్ నిర్మాణం వహించారు. ఈ సినిమాకి వచ్చిన లాభాలతో ఐతే నిర్మాతలు కార్లు బంగారం చిత్ర యూనిట్ కి బహుమానంగా అందించారు.