“జైలర్”..ఇదేం బాదుడు తలైవా..!

తమిళ తలైవా సూపర్ స్టార్ రజినీ కాంత్ కి తన స్టామినాలో సగం రేంజ్ హిట్ తగిలినా ఎలా ఉంటుందో ఇప్పుడు తాను నటించిన తాజా చిత్రం “జైలర్” అయితే చూపిస్తుంది. కాగా ఈ చిత్రం రిలీజ్ అయ్యి మొదటి వారం కంప్లీట్ కాకుండానే తమిళ సినిమా దగ్గర ఉన్న ఎన్నో రికార్డులు లేచిపొయ్యాయి.

అయితే వరల్డ్ వైడ్ గా కూడా భారీ నంబర్స్ ని నమోదు చేస్తున్న ఈ చిత్రం లేటెస్ట్ గా అయితే కేవలం 6 అంటే 6 రోజుల్లోనే 400 కోట్లకి పైగా గ్రాస్ ని రాబట్టి సెన్సేషన్ ని నమోదు చేసింది. దీనితో అయితే అసలు జైలర్ హవా ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఇదే అనుకుంటే ఈ చిత్రం తెలుగులో కూడా భారీ మొత్తంలో కొల్లగొడుతుంది.

ఇప్పటికే 40 కోట్లకి పైగా గ్రాస్ ని అందుకున్న ఈ చిత్రం ఇన్ ఫ్యూచర్ ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ లో 100 కోట్ల గ్రాస్ ని ఒక్క తెలుగు వెర్షన్ నుంచే టచ్ చేసినా ఎలాంటి ఆశ్చర్యం లేదు అని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. ఆల్రెడీ జైలర్ తెలుగు హక్కులు తీసుకున్నవారికి భారీ జాక్ పాట్ దక్కగా దీనితో ఈ చిత్రం తెలుగులో మాత్రం మరిన్ని వండర్స్ సెట్ చేసేలా ఉందని చెప్పాలి.

ఇక ఈ చిత్రంలో తమన్నా గ్లామర్ రోల్ లో కనిపించగా నమ్మ శివన్న అలాగే మోహన్ లాల్ లాంటి బిగ్ స్టార్స్ ముఖ్య పాత్రల్లో నటించారు. అలాగే వీరు అందరినీ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఎక్స్ట్రార్డినరీ గా హ్యాండిల్ చేయగా అనిరుద్ సంగీతం అందించాడు అలాగే సన్ పిక్చర్స్ వారు నిర్మాణం వహించారు.