కులం పేరుతో పిలిచిన నిర్మాత.. స్టేజ్ మీదే కరెక్ట్ చేయించిన జగపతిబాబు

Jagapathi Babu about Producer Damodar prasad at FCUK Press Meet

జగపతి బాబు కులానికి వ్యతిరేకమన్న సంగతి అందరికీ తెలిసిందే. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కూడా కులాల గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. ఇండస్ట్రీలోనూ కుల భావన ఉంది గానీ తనకు మాత్రం అలాంటి బేధాలుండవని చెప్పుకొచ్చాడు. తన ఇంట్లోనూ, తన పిల్లలకు కూడానూ కులాన్ని ఎక్కించలేదని, వారికి అసలు ఆ విషయం కూడా తెలీదని జగపతి బాబు చెప్పుకొచ్చాడు. అలా జగపతి బాబు కుల, మత వర్గీకరణకు వ్యతిరేకమని అందరికీ తెలిసిందే.

Jagapathi Babu about Producer Damodar prasad at FCUK Press Meet
Jagapathi Babu about Producer Damodar prasad at FCUK Press Meet

అలాంటి జగపతి బాబును తాజాగా ఓ నిర్మాత కులం పేరుతో సంబోధించాడు. జగపతి బాబు ఇప్పుడు FCUK (ఫాదర్ చిట్టి ఉమ కార్తీక్) అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ టీజర్ విడుదలై మంచి ప్రశంసలు అందుకుంది. నేటి ట్రెండ్, యూత్‌ను ఆకట్టుకునేలా ఉండటంతో సోషల్ మీడియాలో బాగా క్లిక్ అయింది. అయితే ఈ మూవీ ఫిబ్రవరి 12న విడుదల కాబోతోంది. ఈ మేరకు నేడు చిత్రయూనిట్ మీడియాతో ముచ్చటించింది. ఈకార్యక్రమంలో నిర్మాత చేసిన కామెంట్లను వెంటనే జగపతి బాబు సరిచేశాడు.

FCUK (ఫాదర్ చిట్టి ఉమ కార్తీక్) సినిమాను దామోద‌ర్ ప్ర‌సాద్ నిర్మించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ చౌదరి అంటూ జగపతి బాబును సంభోదించాడు. ఆ వెంటనే జగపతి బాబు దాన్ని కరెక్ట్ చేయించాడు. కులం పేరు పెట్టి అన్నావ్.. చౌదరి కాదు జగపతి బాబు అని చెప్పు అని కరెక్ట్ చేయించాడు. నేను జగపతి బాబును చౌదరి అని పిలుస్తాను.. నాకు అలానే అలవాటు.. మీ ముందు కాబట్టి ఇలా జగపతి బాబు అని అలవాటు చేసుకుంటున్నాను అని నిర్మాత క్లారిటీ ఇచ్చాడు.