వాళ్లిద్దరి మార్కెట్ మళ్లీ పుంజుకోవడం కష్టమే.!

తెలుగు సినీ పరిశ్రమకి సంబంధించి నలుగురు అగ్రహీరోల్లో చిరంజీవి, బాలయ్య యాక్టివ్‌గానే వున్నారు. వెంకటేష్, నాగార్జున మాత్రం డల్ అయిపోయారు. మెగాస్టార్ చిరంజీవి విషయానికి వస్తే, ఆయన ఎప్పుడూ స్టడీగానే వున్నారు. ఆయన రేంజ్, ఆయన స్థాయి ఎప్పుడూ పదిలంగానే వున్నాయ్.

బాలకృష్ణ అయితే కాస్త గట్టిగానే కష్టపడుతున్నారనుకోండి. హడావిడి కూడా కాస్త గట్టిగానే చేస్తున్నారాయన. కానీ, నాగార్జున, వెంకటేష్ విషయం పూర్తిగా భిన్నంగా వుంది.

వెంకటేష్‌ని తీసుకుంటే ఆయనకి పెద్దగా టెన్షన్సేమీ లేవు. చేయాలంటే కామ్‌గా సినిమాలు చేస్తున్నాడు. డిఫరెంట్‌గా ట్రై చేయాలన్నా చేస్తున్నాడు. పెద్దగా ఒత్తిడి తీసుకోకుండా, అసలు సినిమాలు చేయకపోయినా ఫర్వాలేదన్న ఆలోచనలో వున్నారాయన. అలా ఆయన మార్కెట్ పూర్తిగా డల్ అయిపోయింది.

కానీ, నాగార్జున పరిస్థితి వేరే. ఎంత కష్టపడుతున్నా నాగార్జునకి కలిసి రావడం లేదు. మరోవైపు కొడుకుల విషయంలోనూ నాగార్జునకు చాలా చాలా టెన్షన్స్ వున్నాయ్. ఈ టైమ్‌లో డల్‌గా మారిన ఆయన తన మార్కెట్‌ని ఎలా పదిలపరచుకోవాలా.? అని ఆలోచిస్తున్నారట.