తూచ్.! సమంత విషయంలో అదంతా అబద్ధమే.!

సమంత సినిమాలు మానేసిందట. ఓ ఏడాదిపాటు బ్రేక్ తీసుకోనుందట. దీనంతటికీ కారణం మయోసైటిస్ అనే అనారోగ్య సమస్యేనట.! ‘ఖుషీ’ సినిమా తర్వాత, ‘సిటాడెల్’ తర్వాత.. సమంత కొత్త సినిమా దేనికీ ఒప్పుకోలేదనీ, అప్పటికే తీసుకున్న కొన్ని అడ్వాన్సుల్నీ తిరిగి ఇచ్చేసిందనీ పెద్దయెత్తున ప్రచారం జరిగింది.

అయితే, అసలు కథ వేరే వుంది. సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న కొత్త సినిమా కోసం రంగం సిద్ధమయినట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా సినిమా చేయబోతోందిట సమంత. దీినకి సంబంధించిన ప్రకటన త్వరలోనే విడుదల కానుందట.

మయోసైటిస్ సమస్య నుంచి పూర్తిగా కోలుకోవడానికి సమయం పడుతుందిగానీ, ప్రస్తుతానికైతే సమంత ఆరోగ్యంగానే వుందిట. మరి, అడ్వాన్స్ తిరిగిచ్చేసినట్లు వస్తున్న రూమర్స్ సంగతేంటి.? అంటే, జస్ట్ అవి రూమర్స్ మాత్రమేనని సమంత సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.