త్రిష ని ఇక తెలుగు సినిమాలకి అడగడం దండగ ..!

త్రిష నీ మనసు నాకు తెలుసు సినిమాతో బాగానే పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత డార్లింగ్ ప్రభాస్ తో ‘వర్షం’, సిద్దార్థ తో ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ సూపర్ స్టార్ మహేష్ బాబు తో ‘అతడు’ సినిమాలు చేసి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారింది. అంతేకాదు కొన్నేళ్ళ పాటు టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. మెగాస్టార్ చిరంజీవి నుంచి నితిన్ లాంటి యంగ్ హీరోల వరకు దాదాపు అందరు టాలీవుడ్ స్టార్స్ తో సూపర్ హిట్ సినిమాలు చేసింది. త్రిష అకౌంట్ లో బ్లాక్ బస్టర్ సినిమాలే ఎక్కువ.

Athadu | Romantic movies, Good movies, Telugu movies

ఇలా తెలుగు తో పాటు తమిళం, మలయాళం సినిమాలు చేసి భారీ సక్సస్ లు సొంతం చేసుకుంది. కోలీవుడ్ లో కూడా త్రిష చేసిన క్రేజీ ప్రాజెక్ట్స్ ఆ సమయంలో మరే హీరోయిన్ చేయలేదు. నయనతార మాదిరిగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసి తన సత్తా చాటుకుంది. అయితే మధ్యలో కొన్ని ఫ్లాప్స్ రావడం తో ఇటు తెలుగులో అటు తమిళంలో త్రిష కి అవకాశాలు తగ్గిపోయాయి. ఈ క్రమంలో త్రిష సినీ కెరీర్ దాదాపు క్లోజ్ అన్న మాట వినిపించింది. అంతేకాదు ఈ గ్యాప్ లో త్రిష పెళ్ళి చేసుకోబోతుందన్న రూమర్స్ కూడ స్ప్రెడ్ అయ్యాయి.

Living The Dream: Trisha Confirms That She Is Now A Part Of Mani Ratnam's Ponniyin  Selvan! | JFW Just for women

కాని తమిళంలో విజయ్ సేతుపతి తో కలిసి నటించిన 96 సినిమాతో భారీ సక్సస్ ని అందుకొని మళ్ళీ సక్సస్ ట్రాక్ ఎక్కింది త్రిష. 96 కం బ్యాక్ మూవీగా నిలవడమే కాదు త్రిష కి కోలీవుడ్ లో వరసగా అవకాశాలు దక్కేలా చేసింది. ఇప్పుడు త్రిష తమిళ సినిమాలలో చాలా బిజీ. ఎంత బిజీ అంటే ఇప్పట్లో తెలుగు సినిమాలు అడిగి కూడా నో అనిపించుకునేంత. అందుకే చాలామంది త్రిష తమిళ సినిమాల లిస్ట్ చూసి ఇప్పట్లో త్రిష దగ్గరికి తెలుగు సినిమా చేయమని వెళ్ళడం దండగ అని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం త్రిష చేతిలో మణిరత్నం తెరకెక్కిస్తున్న పొన్నియన్ సెల్వన్ సహా 6 క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి.